మూవీడెస్క్: పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన కాంతార కి సీక్వెల్ మాత్రమే కాదు, ప్రీక్వెల్ కూడా అదే స్థాయిలో అంచనాలు పెంచుతోంది.
రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రీక్వెల్‌కి సంబంధించి తాజా అప్‌డేట్‌లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ముఖ్యంగా, ఈసారి ప్రాచీన యుద్ధ కళల ఆధారంగా గ్రాండ్ యాక్షన్ సీక్వెన్స్ ను రూపొందించబోతున్నారు.
కేరళకు చెందిన ప్రాచీన యుద్ధ కళ కాలరిపయట్టు ఆధారంగా మాసివ్ వార్ సీన్ రూపొందించేందుకు అంతర్జాతీయ నిపుణుల సహకారం తీసుకుంటున్నారని సమాచారం.
రిషబ్ శెట్టి మాత్రమే కాకుండా, యుద్ధ సన్నివేశాల్లో పాల్గొనే నటీనటులు ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు.
ఈ సీన్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని, రియలిస్టిక్ టచ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని చిత్ర బృందం చెప్పింది.
ప్రీక్వెల్‌లో కథ మరింత లోతుగా సాగుతుందని, పాత్రల ప్రాధాన్యతను పెంచేలా రిషబ్ శెట్టి స్క్రీన్ ప్లే సిద్ధం చేశాడు.
మొదటి భాగంలో భూతకోలాటం ప్రధాన ఎలిమెంట్‌గా ఉంటే, ఈసారి కథను విస్తరించి మరింత థ్రిల్లింగ్‌గా తీర్చిదిద్దుతున్నారు.
ఈ యాక్షన్ సీన్ షూటింగ్ 80% సినిమా పూర్తి అయిన తర్వాతే ప్రారంభమవుతుందని తెలుస్తోంది.
KANTARA PREQUEL WITH MIND BLOWING WAR ARTS