fbpx
Sunday, January 19, 2025
HomeMovie Newsవకీల్ సాబ్: 'కంటి పాప' పాట విడుదల

వకీల్ సాబ్: ‘కంటి పాప’ పాట విడుదల

KantiPaapa SongReleasedFrom PawanKalyanVakeelSaab

టాలీవుడ్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల నుండి సినిమాల్లోకి తిరిగివచ్చాక తాను హీరోగా విడుదలవుతున్న మొదటి సినిమా ‘వకీల్ సాబ్’. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ నటించిన ‘పింక్’ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా రాబోతుంది. అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరో ఇమేజ్ దృష్ట్యా కొన్ని సీన్స్ అలాగే ఫ్లాష్ బ్యాక్ లో ఒక లవ్ ఎపిసోడ్ లాంటిది ఆడ్ చేసారు డైరెక్టర్. ఈ రోజు ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కి సంబందించిన ఒక పాటని విడుదల చేసింది సినిమా టీం. ‘కంటి పాప కంటి పాప’ అంటూ సాగే ఈ పాట విడుదలవగానే నెంబర్ అఫ్ వ్యూస్ పెంచుకుంటూ ఆకట్టుకుంటుంది.

థమన్ సంగీతం లో వచ్చిన ఈ పాట ఈ సినిమా నుండి మూడవ పాటగా విడుదలైంది. మగువ మగువ అంటూ సాగే పాట, సత్యమేవజయతే అనే మరో పాట ఈ సినిమా నుండి విడుదలై సూపర్ హిట్ గా నిలిచాయి. ఇప్పుడు ఈ హిట్ జాబితాలో మూడో పాట కూడా చేరనుంది. ఈ పాట లిరిక్ వీడియో లో హెరాయిన్ శృతి హాసన్ కి పవన్ కళ్యాణ్ కి ఉన్న బంధాన్ని చూపించారు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఎం.సి.ఏ, ఓహ్ మై ఫ్రెండ్ లాంటి సినిమాలని డైరెక్ట్ చేసిన వేణు శ్రీరామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఏప్రిల్ 9 న థియేటర్లలో విడుదల చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular