న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న టీ 20 వరల్డ్ కప్ కోసం భారత జాతీయ జట్టుకు మెంటార్‌గా ఎంఎస్ ధోనీని నియమించడాన్ని భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ శుక్రవారం స్వాగతించారు, పదవీ విరమణ చెసిన కేవలం ఒక సంవత్సరం అయిన వెంటనే ధోని ఈ స్థాయికి తిరిగి రావడం ఒక ప్రత్యేక సందర్భంగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.
ఒక కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన కపిల్ దేవ్, రిటైర్డ్ క్రికెటర్ తిరిగి జాతీయ స్థాయికి రావడానికి కనీసం మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు గ్యాప్ ఉంటుంది. ఇది ఒక మంచి నిర్ణయం. ఒక క్రికెటర్ పదవీ విరమణ చేసిన తర్వాత అతను మూడు లేదా నాలుగు సంవత్సరాల తర్వాత మాత్రమే సెట్‌కి తిరిగి రావాలని నేను ఎల్లప్పుడూ అభిప్రాయపడ్డాను, కానీ ఇది ప్రపంచ కప్‌లో ఒక ప్రత్యేక సందర్భంలా ఉంది.
పైగా ఈ పాటికే రవి శాస్త్రి కూడా కోవిడ్‌తో బాధపడ్డాడు కాబట్టి ఇది ఒక ప్రత్యేక సందర్భంగా కనిపిస్తుంది “అని కపిల్ దేవ్ అన్నారు. టీ 20 ప్రపంచకప్ కోసం జట్టును ప్రకటించినప్పుడు ధోనీ పాత్రపై బీసీసీఐ బుధవారం ఆశ్చర్యకరమైన ప్రకటన చేసింది.