చరిత్ర: కార్గిల్ విజయ్ దివస్, భారతదేశంలో ప్రతి సంవత్సరం జూలై 26న జరుపుకునే ముఖ్యమైన స్మారక దినం.
1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత సైన్యానికి చెందిన సైనికులు చేసిన త్యాగాలను గౌరవించేందుకు, మన దేశ సమగ్రతను కాపాడేందుకు ఈ రోజు జరుపుకుంటారు.
కార్గిల్ యుద్ధం అని పిలువబడే ఈ సమరం 1999 మే-జూలై మధ్య జమ్మూ కాశ్మీర్‌లోని కార్గిల్ జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి 25 సంవత్సరాల క్రితం జరిగింది,
కార్గిల్ యుద్ధం:
- యుద్ధ స్థలం:
కార్గిల్ యుద్ధం జమ్మూ కాశ్మీర్‌లోని కార్గిల్ జిల్లాలో, నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి జరిగింది. ఈ ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం చలికాలంలో చొరబాటుదారుల పేరుతో తమ సైనికులను పంపి, భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించింది. లడఖ్ మరియు కాశ్మీర్ మధ్య సంబంధాలను తెంచడం మరియు భారత సరిహద్దులో ఉద్రిక్తతలు సృష్టించడం వారి ప్రధాన లక్ష్యం. - పాకిస్తాన్ సైన్యం చొరబాటు:
మే 3, 1999న పాకిస్తాన్ సైన్యం దాదాపు 5000 మంది సైనికులతో కార్గిల్ జిల్లాలోని రాతి పర్వత ప్రాంతంలోని ఎత్తైన ప్రదేశాల్లోకి చొరబడి, భారత భూభాగాన్ని ఆక్రమించుకుంది. ఈ చర్యకు ప్రతిస్పందిస్తూ, భారత సైన్యం ‘ఆపరేషన్ విజయ్’ పేరుతో చొరబాటుదారులను వెనక్కి తరిమే ఆపరేషన్‌ను ప్రారంభించింది. - పాకిస్తాన్ సైన్యపు సూత్రాలు:
కార్గిల్ యుద్ధానికి ముందు, 1998-1999 శీతాకాలంలో, పాకిస్తాన్ సైన్యం సియాచిన్ గ్లేసియర్‌ను క్లెయిమ్ చేయాలనే లక్ష్యంతో కార్గిల్ ప్రాంతంలో రహస్యంగా శిక్షణ తీసుకునే దళాలను పంపింది. పాకిస్తాన్ సైన్యం ముజాహిదీన్‌లను తమ సైనికులు కారు అని వాదించింది. పాకిస్తాన్ ఈ వివాదంపై అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడానికి, కాశ్మీర్ వివాదం గురించి చర్చలు జరపడానికి ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించింది. - యుద్ధం వెనుక కథ:
1971 ఇండో-పాక్ యుద్ధం తరువాత, రెండు దేశాల మధ్య సైనిక ఘర్షణలు జరుగుతూ వచ్చాయి. 1998లో రెండు దేశాలు అణు పరీక్షలు నిర్వహించాయి, ఇది ఉద్రిక్తతలను మరింత పెంచింది. 1999లో లాహోర్ డిక్లరేషన్‌పై సంతకం చేసినప్పటికీ, కాశ్మీర్ వివాదం శాంతియుత పరిష్కార దిశగా కొనసాగలేదు. - ఆపరేషన్ బద్ర్:
పాకిస్తాన్ సాయుధ బలగాలు మరియు పారామిలిటరీ బలగాలు నియంత్రణ రేఖను దాటి భారతదేశం వైపున ఉన్న భూభాగంలోకి చొరబడి, “ఆపరేషన్ బద్ర్” అనే కోడ్-నేమ్‌తో యుద్ధాన్ని ప్రారంభించాయి. కాశ్మీర్ మరియు లడఖ్ మధ్య సంబంధాన్ని తెంచడం, సియాచిన్ గ్లేసియర్ నుండి భారత సైన్యాన్ని ఉపసంహరించుకోవడం ప్రధాన లక్ష్యం. - భీమా విమానాలు మరియు ఆయుధాలు:
భారత వైమానిక దళం (IAF) MiG-21, MiG-23, MiG-27, Jaguars, మరియు Mirage-2000 విమానాలను ఉపయోగించింది. ముఖ్యంగా గ్రౌండ్ అటాక్ కోసం MiG-23లు మరియు MiG-27లు ఉపయోగించబడ్డాయి. పాకిస్తాన్ లక్ష్యాలపై తీవ్ర దాడులు జరిగాయి, IAF MiG-21లు మరియు Mirage 2000 ఈ యుద్ధ సమయంలో విశేషంగా ఉపయోగించబడ్డాయి. - అయుధాలు మరియు రాకెట్లు:
ఈ యుద్ధంలో పెద్ద సంఖ్యలో రాకెట్లు మరియు బాంబులు ఉపయోగించబడ్డాయి. దాదాపు రెండు లక్షల యాభై వేల షెల్లు, బాంబులు, రాకెట్లు ప్రయోగించబడ్డాయి. టైగర్ హిల్ తిరిగి పొందిన రోజు 9,000 షెల్లు కాల్చబడ్డాయి. ఇది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శత్రు సైన్యంపై అత్యంత పెద్దఎత్తున బాంబు దాడులు జరిపిన యుద్ధంగా పరిగణించబడుతుంది.
స్మరణ:
కార్గిల్ విజయ్ దివస్, భారత సైన్యానికి గొప్ప విజయాన్ని అందించిన, దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికులను స్మరించడానికి ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ రోజున, కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించటానికి, వారి త్యాగాలను స్మరించటానికి, మన దేశం అంకితభావంతో నివాళులు అర్పిస్తుంది.