fbpx
Wednesday, November 27, 2024
HomeTelanganaకరీంనగర్ ఎమ్మెల్యేకు హనీ ట్రాప్!

కరీంనగర్ ఎమ్మెల్యేకు హనీ ట్రాప్!

Karimnagar MLA honey trap!

కరీంనగర్ ఎమ్మెల్యేకు న్యూడ్ వీడియో కాల్!!!

హైదరాబాద్: ఇటీవల సైబర్ నేరాలు కొత్త రూపాల్లో విస్తరిస్తూ, సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ బెడదలా మారుతున్నాయి. న్యూడ్ వీడియో కాల్స్, బ్లాక్‌మెయిల్ తరహా మోసాలు పెరుగుతున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే కూడా ఈ నేరగాళ్ల దాడికి గురయ్యారు. అక్టోబర్ 14న అర్ధరాత్రి వచ్చిన ఓ వీడియో కాల్ ఆయనను షాక్‌కు గురిచేసింది. గుర్తు తెలియని నెంబర్ నుంచి వచ్చిన ఈ కాల్‌ను లిఫ్ట్ చేసిన ఆయన, అవతలి వైపు ఓ యువతి నగ్నంగా కనిపించడం చూసి నిర్ఘాంతపోయారు. వెంటనే కాల్ కట్ చేసి, సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడలు

ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు మరింత విస్తరించి, ప్రజలను మోసపుచ్చడానికి పలు మార్గాలను అవలంబిస్తున్నారు. గిఫ్ట్‌లు, ఈ కేవైసీలు, లాటరీలు వంటి పాత ఎత్తుగడలు వదిలి ఇప్పుడు న్యూడ్ వీడియో కాల్స్ చేయడం ద్వారా డబ్బు డిమాండ్ చేస్తున్నారు. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చిన వీడియో కాల్స్‌లో అవతలి వ్యక్తి నగ్నంగా కనిపించి, రికార్డ్ చేసిన తర్వాత, ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు.

ఎమ్మెల్యే ఫిర్యాదు

కరీంనగర్ ఎమ్మెల్యే ఈ ఘటనపై తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రాజకీయ ప్రత్యర్థులు తనను మోసం చేయడానికి, పబ్లిక్‌లో పరువు తీసే ఉద్దేశంతో ఈ వీడియో కాల్ చేశారా? లేక సైబర్ నేరగాళ్లు డబ్బు కోసం చేశారా అని అనుమానించారు. ఎమ్మెల్యే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB)కు కూడా వ్రాతపూర్వక ఫిర్యాదు చేశారు.

పోలీసుల సూచనలు

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గుర్తు తెలియని నెంబర్ ఆధారంగా ఎవరీ నేరగాళ్లు అనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే వీడియో కాల్స్‌ను లిఫ్ట్ చేయవద్దని, లిఫ్ట్ చేయాల్సి వస్తే ముఖం కనిపించకుండా జాగ్రత్త పడాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదైనా అనుమానం వస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular