fbpx
Friday, September 20, 2024
HomeMovie Newsసత్యం సుందరం: కార్తీ మరో కొత్త ప్రయోగం

సత్యం సుందరం: కార్తీ మరో కొత్త ప్రయోగం

KARTHI-COMING-WITH-SATYAM-SUNDARAM-NEW-ROLE
KARTHI-COMING-WITH-SATYAM-SUNDARAM-NEW-ROLE

మూవీడెస్క్: తెలుగులో పలు సూపర్ హిట్లతో గుర్తింపు పొందిన కార్తీ, ఇప్పుడు తన నెక్స్ట్ చిత్రం సత్యం సుందరం తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

సెప్టెంబర్ 28న ఈ సినిమాను తమిళ్ తెలుగులో గ్రాండ్ గానే రిలీజ్ చేస్తున్నారు. 

ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి, ఎందుకంటే ’96’ వంటి క్లాసిక్‌ని అందించిన ప్రేమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకుడు.

అయితే, ఈ సినిమాలో పాటలు, ఫైట్లు లేవనడంతో ఓ వర్గం అభిమానులు కొంత షాక్ అయ్యారు.

కార్తీ స్వయంగా ఈ విషయాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వెల్లడించడంతో, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం పై చర్చలు ప్రారంభమయ్యాయి.

అయితే, కార్తీ ఇక్కడ వినోదాన్ని అందిస్తానని ఆశిస్తున్నాడు. సత్యం సుందరం, పెళ్లి మండపంలో కలుసుకున్న ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన రాత్రి కథను ఆవిష్కరిస్తుంది.

ఇందులో అధిక శాతం కార్తీ, అరవింద్ స్వామి మధ్య జరగడంతో, ప్రమోషన్లలో వీళ్లపై దృష్టి కేంద్రీకరించారు.

గోవింద్ వసంత్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రం, ప్రయోగాత్మకమైన దృక్పథంతో, ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular