fbpx
Wednesday, April 23, 2025
HomeMovie Newsసర్దార్: మరో కొత్త రూపంలో కార్తీ ఫస్ట్ లుక్

సర్దార్: మరో కొత్త రూపంలో కార్తీ ఫస్ట్ లుక్

Karthi SardaarMovie FirstLook

కోలీవుడ్: ప్రస్తుతం ఉన్న తమిళ నటుల్లో రజిని కాంత్, కమల్ హాసన్ తర్వాత తెలుగులో అంత క్రేజ్ ఉన్న నటుల్లో సూర్య మరియు కార్తీ బ్రదర్స్ ఉంటారు. కార్తీ అయితే తన డబ్ కూడా తెలుగులో తానే చెప్తాడు. అంతే కాకుండా నాగార్జున తో కలిసి ‘ఊపిరి’ అనే డైరెక్ట్ తెలుగు మూవీ కూడా చేసి మంచి హిట్ సాధించాడు. ‘ఖైదీ’, ‘ఆవారా’, ‘యుగానికి ఒక్కడు’ లాంటి సినిమాలు ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ పొందాయి. రీసెంట్ గా విడుదలైన ‘సుల్తాన్’ మిక్స్డ్ టాక్ తో పరవాలేదనిపించింది. ఇపుడు కార్తీ మరో సినిమాలో నటిస్తున్నాడు. ‘సర్దార్’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈరోజు విడుదలైంది. ఒక కొత్త లుక్ లో కార్తీ మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేయబోతున్నాడని అర్ధం అవుతుంది.

విశాల్ తో ‘అభిమన్యుడు’, శివ కార్తికేయన్ తో ‘శక్తి’ అనే సినిమాలు రూపొందించిన ‘పి.ఎస్. మిత్రన్‘ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాకి జి.వీ.ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ లుక్ వీడియో లో వినిపించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. ఈ సినిమాలో కార్తీ కి జోడీ గా రాశి ఖన్నా, రాజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్.లక్ష్మణ్ కుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్ లో చూపించిన కార్తీ మేకర్ ఓవర్ లుక్ ఆకట్టుకుంది. ఈ సినిమా షూటింగ్ రేపటి నుండి మొదలవనుంది కార్తీ ట్విట్టర్ ద్వారా తెలియచేసారు.

Sardar [Telugu] - Official Motion Poster | Karthi | PS Mithran | GV Prakash | Prince Pictures

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular