కోలీవుడ్: జయాపజయాలకు సంబంధం లేకుండా విలక్షణమైన కథలు ప్రయత్నించే హీరోల్లో ‘కార్తీ‘ ఒకడు. ‘యుగానికి ఒక్కడు’, ‘ఖాఖీ’, ‘ఖైదీ’ లాంటి సినిమాల ద్వారా అతని నటన మరియు స్టోరీ సెలెక్షన్ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. తమిళ్ లో సమానంగా తెలుగులో కూడా ఫ్యాన్ బేస్ పెంచుకున్న హీరో కార్తీ. దాదాపు కార్తీ ప్రతీ సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా డబ్ అయ్యి విడుదల అయింది. ఒక ఇంటర్వ్యూ లో తమిళ్ కన్నా తెలుగు అభిమానులు అంటే ఎక్కువ ఇష్టం అని కార్తీ చెప్పాడు. దాంతో పాటు తెలుగులో ‘ఊపిరి’ అనే డైరెక్ట్ తెలుగు మూవీ కూడా చేసారు. మరొక గొప్ప విషయం ఏంటంటే తన సినిమాలకి తెలుగులో తానే వాయిస్ ఇస్తున్నాడు.
కార్తీ కి జోడీ గా రష్మిక నటిస్తుంది. రష్మిక కి ఇది తమిళ్ లో మొదటి సినిమా. శివ కార్తికేయన్ తో ‘రెమో’ సినిమా తీసిన బక్కియరాజ్ కణ్ణన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు సినిమా టీం. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్.ఆర్ ప్రకాష్ బాబు,ఎస్.ఆర్ ప్రభు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వివేక్ మెర్విన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.