కోలీవుడ్: కోలీవుడ్ హీరో కార్తీ తమిళ్ లో ఎంత పాపులారిటీ ఉందో తెలుగులో కూడా అంత పాపులారిటీ ఉంది. తన సినిమాలు తమిళ్ కి సమానంగా ఇక్కడ ఆడుతాయి. తన బ్రదర్ సూర్య లాగ తెలుగు లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతే కాకుండా కార్తీ తెలుగులో తన సినిమాలకి తానే డబ్బింగ్ చెప్పుకోవడం కూడా కార్తీకి కలిసొచ్చే అంశం. కార్తీ ప్రస్తుతం ‘సుల్తాన్’ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాకి సంబందించిన టీజర్ ఈరోజు విడుదలైంది. ఈ సినిమా టీజర్ చూసిన తర్వాత కొంచెం ‘మిర్చి’, ‘దమ్ము’ సినిమా పోలికలు కనపడుతున్నాయి అని చెప్పవచ్చు.
‘మహాభారతం లో కృష్ణుడు పాండవుల వైపు ఉన్నాడు, అదే కౌరవుల వైపు ఉంటే ఎలా ఉండేదో తెలియదు కదా.. అసలు యుద్ధమే లేకుండా మహా భారతం ఎలా ఉంటదో ఊహించుకోండి’ అని డైలాగ్ ద్వారా సినిమా థీమ్ కొంత వరకు తెలియ చేసారు. ఈ సినిమా ప్లాట్ పైన చెప్పిన సినిమాల ప్లాట్ కి దగ్గరగా ఉందని చెప్పవచ్చు. ఈ సినిమాతో రష్మిక మందన్న తమిళ్ లో మొదటిసారి నటిస్తుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్.ఆర్ ప్రకాష్ బాబు, ఎస్.ఆర్ ప్రభు ఈ సినిమాని నిర్మించారు . ‘రెమో’ డైరెక్టర్ బాక్యరాజ్ కన్నన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 2 న ఈ సినిమాని విడుదల చేయనున్నట్టు కూడా ప్రకటించారు.