కోలీవుడ్: తమిళ హీరో సూర్య తమ్ముడిగా కార్తీ సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. పేరుకి తమిళ హీరోగా అయినప్పటికీ కార్తీ కి తెలుగులో కూడా తమిళ్ లో ఉన్నంత మార్కెట్ ఉంది. అందుకే తన సినిమాలకి తెలుగులో కూడా డబ్బింగ్ తానే చెప్పుకుంటాడు. నాగార్జున తో కలిసి ‘ఊపిరి’ అనే డైరెక్ట్ తెలుగు మూవీ కూడా చేసాడు కార్తీ. ప్రస్తుతం కార్తీ ‘సుల్తాన్’ అనే ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా నుండి ‘అందమే అతివై వస్తే’ అంటూ సాగే పాట విడుదలైంది.
వివేక్-మెర్విన్ సంగీతంలో రూపొందిన ఈ పాట మెలోడియస్ గా ఆకట్టుకుంటుంది. తమిళ్ లో ఈ పాటని అక్కడి స్టార్ హీరో శింబు ఆలపించారు. తెలుగులో పృథ్వి చంద్ర పాడారు. ఈ పాటలో హీరో హీరోయిన్ కి మధ్య లవ్ స్టోరీ చూపించనున్నట్టు లిరికల్ వీడియో ద్వారా తెలుస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ పొజిషన్ కోసం ట్రై చేస్తున్న రష్మిక మందన్న ఈ సినిమాలో కార్తీ కి జోడి గా నటిస్తుంది. రష్మిక కి ఇది తమిళ్ లో మొదటి సినిమా. శివ కార్తికేయన్, కీర్తి సురేష్ కాంబినేషన్ లో రూపొందిన ‘రెమో’ సినిమాని డైరెక్ట్ చేసిన బాఖ్యరాజ్ కన్నన్ ఈ సినిమాని డైరెక్ట్ చేసాడు. డ్రీం వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ఏప్రిల్ 2 న తెలుగు మరియు తమిళ్ లో విడుదల చేస్తున్నారు.