కోలీవుడ్: తమిళ్ తో సమానంగా తెలుగులో మార్కెట్ ఉన్న నటులలో రజినీకాంత్, కమల్ హాసన్ తర్వాత సూర్య, కార్తీ పేర్లు వినిపిస్తాయి. కార్తీ ప్రస్తుతం విడుదలకి సిద్ధం చేస్తున్న సినిమా ‘సుల్తాన్’. శివ కార్తికేయ, కీర్తి సురేష్ కాంబినేషన్ లో రూపొందిన ‘రెమో’ సినిమాని రూపొందించిన భాఖ్యరాజ్ కన్నన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. డ్రీం వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్.ఆర్ ప్రకాష్ బాబు, ఎస్.ఆర్ ప్రభు ఈ సినిమాని నిర్మించారు. ఒక పూర్తి యాక్షన్ డ్రామా గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలైంది.
ఒక వంద మంది రౌడీ ల గుంపుని ఒక ఊళ్లోకి ఊరి ప్రజలు రానివ్వకపోవడం, వాళ్ళు రౌడీ లు కాదు నా అన్నలు అని కార్తీ చెప్పడం, వాళ్ళందరూ కార్తీ వెంట ఉండి కార్తీ కి సపోర్ట్ గా నిలవడం, టీజర్ లో చెప్పినట్టు కౌరవుల సైడ్ ఉండి మహాభారతం ఉంటె ఎలా ఉంటుంది అసలు యుద్ధమే ఉండదు కదా అనే డైలాగ్స్ ని బట్టి వంద మంది రౌడీ లని మంచి మనుషులుగా మర్చి వాళ్ళతో ఊరి బాగు కోసం ఏదైనా ప్రయత్నం చేస్తాడు కార్తీ అని అనిపిస్తుంది.
ఈ సినిమాలో కార్తీ కి జోడీ గా రష్మిక మందన్న నటిస్తుంది. రష్మిక కి తమిళ్ లో ఇది మొదటి సినిమా. ఇందులో హీరో చేసే పనులని అడ్డుకునే చలాకి మరియు రెబల్ పాత్రలో రష్మిక నటిస్తుందని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. కే.జి.ఎఫ్ లో విలన్ గా నటించిన గరుడ ఈ సినిమాలో విలన్ గ్గా నటిస్తున్నాడు. పూర్తి యాక్షన్ తో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 2 న థియేటర్లలో విడుదల అవనుంది.