fbpx
Sunday, January 19, 2025
HomeMovie News'చావు కబురు చల్లగా' టీజర్ విడుదల

‘చావు కబురు చల్లగా’ టీజర్ విడుదల

Karthikeya ChavukaburuChallaga MovieTeaser

టాలీవుడ్: RX100 సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న హీరో ‘కార్తికేయ గుమ్మకొండ’. ప్రస్తుతం ఈ హీరో చేస్తున్న సినిమా ‘చావు కబురు చల్లగా’ . ఈ సినిమాలో ఈ హీరో స్మశానానికి శవాలను తీసుకెళ్లే పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కార్తికేయ పాత్ర పేరు ‘బస్తీ బాలరాజు’. RX100 సినిమా తర్వాత గుణ 369 , హిప్పీ, 90ml లాంటి ప్లాప్ ల తర్వాత రాబోతున్న సినిమా ఇది. మధ్యలో ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో విలన్ గా నటించి కూడా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో ఆశలన్నీ ఈ సినిమా పైన్నే పెట్టుకున్నాడు. GA2 పిక్చర్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అల్లు అరవింద్ అంటేనే సినిమా మినిమం గ్యారంటీ ఉంటుంది. ఈ చిత్రం ద్వారా పెగళ్ళపాటి కౌశిక్ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు.

ఈరోజు కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల చేసారు. ‘ఎదవ నాయాలా.. శవాన్ని తోలుకుపోరా అంటే.. మొగుడు పోయిన దాన్ని కెలికొచ్చాడు’ అంటూ హీరోను తల్లి తిడుతుంది ‘ఆడెట్టా పోయాడు కదే.. ఇప్పుడది ఖాళీనే’ అంటూ సాగే హీరో సంభాషణ హ్యూమరస్ గా ఉంది. ఈ సినిమాలో మదర్ క్యారెక్టర్ లో ఆమని నటిస్తుంది. టీజర్ లో చూపిన యాస, మాటలు ఆకట్టుకున్నాయి. కార్తికేయ కి జోడి గా ఈ సినిమాలో ‘లావణ్య త్రిపాఠి’ నటిస్తుంది. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా సునీల్ రెడ్డి కెమెరామెన్ గా వ్యవహరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular