fbpx
Sunday, January 19, 2025
HomeMovie News'చావు కబురు చల్లగా' ట్రైలర్ విడుదల

‘చావు కబురు చల్లగా’ ట్రైలర్ విడుదల

Karthikeya ChavuKaburuChallala TrailerReleased

టాలీవుడ్: RX100 సినిమా ద్వారా పరిచయం అయ్యి మొదటి సినిమానే సూపర్ హిట్ పొందిన నటుడు కార్తికేయ. ఆ తర్వాత రెండు మూడు సినిమాలు విడుదల అయినా కూడా హిట్ వరించలేదు. నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గా కూడా నటించి మెప్పించాడు. ఐతే ఈ హీరో గీత ఆర్ట్స్ వారి కళ్ళల్లో పడి ప్రస్తుతం వారి బ్యానర్ లో ఒక సినిమాలో నటించాడు. ఈ రోజు ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ విడుదలైంది. అల్లు అరవింద్ సమర్పణలో GA2 పిక్చర్స్ బ్యానర్ పై ‘చావు కబురు చల్లగా’ అనే సినిమాలో కార్తికేయ హీరోగా నటించాడు. బన్నీవాసు ఈ సినిమాని నిర్మించాడు.

సినిమాలో కార్తికేయ శవాలని మోసుకెళ్లే వాన్ డ్రైవర్ గా నటించాడు. అంతే కాకుండా భర్త చనిపోయి ఆ భర్త చివరి కార్యక్రమానికి విచ్చేసిన భార్య ని ప్రేమించి ఆ అమ్మాయి ప్రేమని పొందే కారెక్టర్ పోషిస్తున్నాడు కార్తికేయ. బహుశా ఇప్పుడు ఇండస్ట్రీ లో ఉన్న హీరోల్లో ఇలాంటి కారెక్టర్ ఎవరూ చేయలేదు. భర్త చనిపోయిన కారెక్టర్ లో హీరోయిన్ లావణ్య త్రిపాఠి నటిస్తుంది. ఈ సినిమాలో ఇద్దరూ డి-గ్లామర్ పాత్రలే చేస్తున్నారు. ట్రైలర్ వరకు ఆద్యంతం కామెడీ తో , హీరోయిన్ వెంటపడే సీన్స్ పూరి స్టైల్ లో అలరించాయి. పెగళ్ళపాటి కౌశిక్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా మార్చ్ 19 న థియేటర్లలో విడుదల అవనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular