fbpx
Wednesday, January 8, 2025
HomeMovie Newsమళ్ళీ ఇన్నాళ్లకు తొలిప్రేమ డైరెక్టర్ కరుణాకరన్ న్యూ ప్రాజెక్ట్

మళ్ళీ ఇన్నాళ్లకు తొలిప్రేమ డైరెక్టర్ కరుణాకరన్ న్యూ ప్రాజెక్ట్

KARUNAKARAN-ON-NEW-PROJECT-AFTER-LONG-GAP
KARUNAKARAN-ON-NEW-PROJECT-AFTER-LONG-GAP

మూవీడెస్క్: పవన్ కళ్యాణ్ తో తొలిప్రేమ వంటి ఎవర్గ్రీన్ హిట్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు కరుణాకరన్.

ఆ తరువాత కూడా అనేక ప్రేమ కథా చిత్రాలతో విజయాలు అందుకున్నారు. కానీ, గత కొన్నేళ్లుగా అతను సినిమాలకు దూరమయ్యారు.

చివరగా 2018లో సాయి ధరమ్ తేజ్‌తో చేసిన తేజ్ ఐ లవ్ యు సినిమా అంచనాలను అందుకోలేక పోయింది.

అయితే, ఇప్పుడు దిల్ రాజు మళ్ళీ కరుణాకరన్‌కి అవకాశం ఇచ్చారు. ఇటీవల కరుణాకరన్ తన స్టైల్‌లో ఓ ప్రేమకథను దిల్ రాజుకు నేరేట్ చేయగా, దిల్ రాజు ఆ కథకు ముగ్ధుడై ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం.

ఈ చిత్రంలో ఆయన ఫ్యామిలీ హీరో ఆశీష్ ప్రధాన పాత్రలో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

దిల్ రాజు బ్యానర్‌లో దొరికిన ఈ అవకాశంతో కరుణాకరన్ తన కంబ్యాక్‌కి సిద్ధమవుతున్నారు.

గతంలో డార్లింగ్ చిత్రంతో ప్రభాస్‌కి హిట్ ఇచ్చిన ఆయన, ఈ సారి ఎలాంటి ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular