టాలీవుడ్: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అచ్చ తెలుగు టైటిల్స్ తో వచ్చే సినిమాలు చాల అరుదుగా ఉంటాయి. ఇపుడు రాబోతున్న అలాంటి ఒక సినిమా ‘కథ కంచికి మనం ఇంటికి’. ఈ మధ్యనే ఈ సినిమా ప్రకటించారు. ఈ రోజు ఈ సినిమా హీరో ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. చెప్పినట్టు గానే ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న అదిత్ అరుణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు ఈ సినిమా నుండి అదిత్ కి సంబందించిన ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదల చేసింది సినిమా టీం. ఒంటి నిండా రక్తంతో హీరో ఆదిత్ ఉంది, వెనక సాధువులు శివుని విభూది పూసుకుని శూలాలతో నిలబడి ఉన్నారు.
ఎంపీ ఆర్ట్స్ బ్యానర్ పై మోనిష్ పత్తిపాటి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. చాణక్య చిన్న అనే దర్శకుడు ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. జెనీలియా నటించిన ‘కథ’ సినిమాతో హీరోగా పరిచయం అయినా కూడా తెలుగులో అంతగా హిట్లు కొట్టలేదు, గుర్తింపు తెచ్చుకోలేదు ఈ హీరో. ప్రస్తుతం రాజ శేఖర్ కుమార్తె శివాని హీరోయిన్ గా ‘www ‘ అనే ఒక సినిమా కూడా విడుదలకి సిద్ధంగా ఉంది. దీంతో పాటు తమిళ నటి మేఘ ఆకాష్ తో ‘డియర్ మేఘ’ అనే ఒక సినిమా కూడా రూపొందుతుంది.