టాలీవుడ్: తెలుగు లో వచ్చే చాలా సినిమాలకి సింగల్ వర్డ్ లో హీరో పేరు, లేక మిషన్ కి సంబందించిన పేరు, లేక ఏవైనా ఇంగ్లీష్ పేరు ఉంటాయి. పూర్తి తెలుగు టైటిల్స్, అవి కూడా పాత రోజుల్ని గుర్తు చేసి మంచి తెలుగు టైటిల్స్ తో సినిమాలు రావడం అరుదు. ఇపుడు అలాంటి ఒక టైటిల్ తో రాబోతున్నాడు యువ హీరో అదిత్ అరుణ్.
చాలా మందికి చిన్నప్పుడు కథలు చెప్తూ ఉంటారు పెద్ద వాళ్ళు, కథ మొదలు పెట్టేప్పుడు ‘అనగనగా’ అని ప్రారంభించి.. చివర్లో కథ అంతా ముగిశాక ‘కథ కంచికి మనం ఇంటికి’ అని ముగించేవారు. ఇపుడు అదిత్ కూడా ‘కథ కంచికి మనం ఇంటికి’ అనే టైటిల్ తో ఒక సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా టైటిల్ ని ఈరోజు లాంచ్ చేసింది సినిమా టీం. ఈ నెల 8 న హీరో ఫస్ట్ లుక్ ని విడుదల చేయబోతుంది సినిమా టీం.
జెనీలియా నటించిన ‘కథ’ సినిమా ద్వారా పరిచయం అయిన నటుడు అదిత్. గరుడ వేగ సినిమాలో ఒక మంచి పాత్రలో మెరిశాడు. తర్వాత కొన్ని యావరేజ్ సినిమాల్లో నటించి ఇమేజ్ ని పాడు చేసుకున్నాడు. అడపాదడపా కొన్ని సినిమాలు చేస్తున్నప్పటికీ ఆశించినంత గుర్తింపు రావట్లేదు. ప్రస్తుతం ‘www ‘ అనే కోతరకమైన కథతో వస్తున్నాడు. ఈ ‘కథ కంచికి మనం ఇంటికి’ సినిమాని మోనిష్ పత్తిపాటి నిర్మాణంలో చాణక్య చిన్నా అనే దర్శకుడు డైరెక్ట్ చేయబోతున్నాడు.