హైదరాబాద్: తెలంగాణ టీఆర్‌ఎస్‌లో పది రోజుల క్రితం చేరిన హుజూరాబాద్ నియోజకవర్గ నేత అయిన కౌశిక్‌రెడ్డి శాసన మండలికి గవర్నర్ కోటాలో నామినేట్ చేయబడ్డారు. ఆదివారం ఈ మేరకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ కౌశిక్‌రెడ్డి పేరును రాష్ట్ర గవర్నర్ తమిళిసైకి సిఫారసును అందించింది.
ఇంతకుముందు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయిన ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి పదవీకాలం పూర్తవడం వల్ల, ఇప్పుడు ఆ స్థానానికి కౌశిక్‌రెడ్డి పేరును రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేశారు. తమ పార్టీలోకికి చేరిన సందర్భంలోనే కౌశిక్‌రెడ్డిని కేవలం హుజూరాబాద్‌కే పరిమితం కాకుండా రాష్ట్రం మొత్తం మీద గుర్తింపును ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌గా ఆయనకు అవకాశం వస్తుందని భావించగా, ఏకంగా మండలికి నామినేట్ కావడం టీఆర్‌ఎస్ వర్గాలను కాస్త ఆశ్చర్యానికి లోనయ్యేలా చేసింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక లక్ష్యంగా పావులు కదుపుతున్న ముఖ్యమంత్రి ఇప్పటికే హుజూరాబాద్ కు చెందిన బండా శ్రీనివాస్‌ను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా జూలై 23వ తేదీన నియమించారు.
ఇదే నేపథ్యంలోనే కౌశిక్‌రెడ్డిని తెలంగాణ ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేశారు. కాగా రానున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికే పార్టీ టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే కౌశిక్రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే టీటీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఎల్.రమణ లేదా టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌లో ఒకరు హుజూరాబాద్ అభ్యర్థిగా ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది.