తెలంగాణ: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఫార్మర్స్ ఫెడరేషన్‌కు చెందిన విజయ్ పాల్ రెడ్డి ఈ పిటిషన్‌ను వేయగా, కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకాకపోవడంపై చర్యలు తీసుకోవాలని కోరారు.
విజయ్ పాల్ రెడ్డి పిటిషన్‌లో, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రజల తరఫున అసెంబ్లీలో పోరాడాలని, హాజరు లేకపోతే ఎమ్మెల్యే పదవి రద్దు చేయాలని కోరారు. 2023 డిసెంబర్ 16న ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టినప్పటికీ, ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరుకాలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.
కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్‌లో కొత్త నాయకుడిని బీఆర్ఎస్ నుంచి నిలపాలని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించాలని పిటిషనర్ కోరారు.
ప్రజా సమస్యలు అసెంబ్లీలో వినిపించాల్సిన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ విఫలమవుతున్నారని, ఆయనపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో వివరించారు.
ప్రస్తుతం ఈ పిటిషన్ హైకోర్టు రిజిస్ట్రీలో పరిశీలనలో ఉంది. తదుపరి విచారణలో కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.