fbpx
Friday, February 21, 2025
HomeTelanganaసెంటిమెంట్ పై కేసీఆర్ ఫోకస్.. బీఆర్‌ఎస్‌లో న్యూ టార్గెట్

సెంటిమెంట్ పై కేసీఆర్ ఫోకస్.. బీఆర్‌ఎస్‌లో న్యూ టార్గెట్

kcr-focus-on-sentiment

తెలంగాణ: మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి తెలంగాణ సెంటిమెంట్‌ను ముందుకు తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఇటీవల జరిగిన బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన తెలంగాణ ఉద్యమం, నాటి అవమానాలు, ఎదుర్కొన్న సవాళ్లను ప్రస్తావించడం గమనార్హం.

“నీళ్లు-నిధులు-నియామకాలు” కోసం తాము ఎంతగా పోరాడామో, ఆ ఉద్యమం సమయంలో కుటుంబం మొత్తం రోడ్డెక్కిందని కేసీఆర్ వివరించారు. తెలంగాణ మళ్లీ వెనుకబాటుకు వెళ్లకూడదనే ఉద్దేశంతోనే ఈ సెంటిమెంట్‌పై నడుస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సమావేశంలో కేసీఆర్ పార్టీ నాయకులకు పలు కీలక టార్గెట్లు ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ను బలోపేతం చేయడానికి సభ్యత్వ నమోదు ఉధృతం చేయాలని, ప్రతి గ్రామంలో పార్టీ శక్తిని పెంచాలని ఆదేశించారు.

ఈ బాధ్యతలను హరీష్ రావు కడుపున పడ్డారు. అలాగే, ఏప్రిల్‌లో బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular