నెల్లికల్లు: తెలంగాణ సీఎం కేసీఆర్ పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. నెల్లికల్లులో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాప చేసిన కేసీఆర్ లిఫ్టు ఇరిగేషన్ వరకు ఎల్ ఎల్ సీ పంప్ హౌజ్ నుంచి ఎచ్ ఎల్ సీ 8, 9 డిస్ట్రిబ్యూటరీ ద్వారా నీటి సరఫరాకు మరమ్మత్తుల పనులు మరియు దేవరకొండ నియోజకవర్గ పరిధిలో పొగిల్ల ఎత్తిపోతల, కంబాలపల్లి ఎత్తిపోతల, నంబాపురం-పెద్దగట్టు ఎత్తిపోతలకు శంకుస్థాపన చేశారు.
పెద్దమునగాల ఎత్తిపోతల, ఏకేబీఆర్ ఎత్తిపోతల పథకం, మిర్యాల గూడ నియోజకవర్గ పరిధిలోని దున్నపోతుల గండి, బాల్లేపల్లి చాప్లాతాండా ఎత్తిపోతల, కేశవాపురం కొండ్రాపోల్, బొత్తల పాలెం వాడపల్లి ఎత్తిపోతల, నాగార్జున సాగర్ మిర్యాలగూడ నియోజకవర్గాల పరిధిలోని ఎస్‌ఎల్‌బీసీ కాల్వ 1.8 కిమీ నుంచి 70.52 కిమీ వరకు సీసీ లైనింగ్ లకు కూడా శంకుస్థాపన చేశారు.
హుజూర్ నగర్ కోదాడ నియోజక వర్గాల పరిధిలో ముక్త్యాల బ్రాంచ్‌కు ఎత్తిపోతల, జాన్ పహాడ్ బ్రాంచ్ఎకు ఎత్తిపోతలతో పాటు డిస్ట్రిబ్యూటరీ సీసీ లైనింగ్, ముక్త్యాల బ్రాంచ్ కెనాల్, ఇతర ట్యాంకులుకు సీసీ లైనింగ్, అధునీకరణ, సూర్యాపేట హుజూర్ నగర్ కోదాడ పరిధిలోని సాగర్ ఎడమ కాల్వ 70.52 కిమీనుంచి 115.4 కిమీ వరకు సీసీ లైనింగ్ అభివృద్ది పనులకు సంభందించిన శంఖు స్థాపనలన్నింటిని నెల్లికల్లులో ఒకే చోట చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పనుల వివరాల మ్యాప్‌లను సందర్శించి వాటీ గురించి వివరాలు అడిగి మరీ తెలుసుకున్నారు. నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక సన్నాహాల్లో భాగంగా బుధవారం హాలియాలో టీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించారు. టీఆర్‌ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరయ్యే ఈ సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు లక్షల మందిని సమీకరించడం లక్ష్యంగా టీఆర్‌ఎస్ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు.