ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) ఇవాళ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో గరితో భేటీ అయ్యారు. ఇటీవల తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో భారీ వర్షాలు మరియు వరద నష్టానికి గురైన సంగతి తెలిసిందే.
అయితే ఈ భారీ ఆస్తి నష్టానికి ఆర్థిక సాయం చేయాలని కేంద్రమంత్రిని కలిసి కేసీఆర్ విజ్ఞప్తి చేసారు. ఈ భాటీ లో వీరిద్దరి మధ్య వరద సాయంతోపాటు ఇతర కీలకమైన అంశాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. సుమారు 45 నిమిషాల పాటు వీరిద్దరి మధ్య చర్చలు సాగాయి.
రేపు అనగా శనివారం కూడా సీఎం కేసీఆర్ దేశ రాజధాని ఢిల్లీలోనే ఉండనున్నారు. ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్, తొలుత కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశం సుమారు గంటకుపైగా కొనసాగింది. కృష్ణా, గోదావరి జలాల వివాదాలు, ప్రాజెక్టులు తదితర అంశాలపై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది.