హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ కంపెనీని ప్రైవేటీకరణ చేయనున్నామని కేంద్రం ప్రకటించినప్పటినుండి రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశ వ్యాప్తంగా దుమారం రెపుతోంది. కాగా ఆంధ్ర చేస్తున్న ఈ విశాఖ ఉక్కు కంపెనీ కాపాడుకునే ఉద్యమానికి మద్దతిస్తున్నట్లు తెలిపారు తెలంగాణ మంత్రి కేటీఆర్.
ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ, ‘‘అవసరమైతే ప్రత్యక్ష ఉద్యమంలో కూడా మేము పాల్గొనడానికి సిద్ధం అన్నారు. కేసీఆర్ అనుమతితో విశాఖకు వెళ్లి మరీ మద్దతు ఇస్తాం. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తూ ఉంటే మేం చూస్తూ ఊరుకోం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రధాని ప్రైవేట్‌పరం చేసేలా ఉన్నారు’’ అంటూ కేటీఆర్ తీవ్రంగా మండి పడ్డారు.
ఇదిలా ఉండగా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ తథ్యమని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కులో రాష్ట్ర ప్రభుత్వానికి వాటా లేదని ఈ సందర్భంగా కేంద్రం స్పష్టం చేసింది. ప్రైవేటీకరణ విషయంలో అవసరమైతేనే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతామని, అది కూడా నిర్దిష్ట విషయాల్లో మాత్రమే సంప్రదిస్తామని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ జోక్యం అవసరమయ్యే అంశాల్లో మాత్రమే ఈ సంప్రదింపులు ఉంటాయని పేర్కొంది.