తెలుగు సినీ సంగీతంలో తనదైన ముద్ర వేసుకున్న ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి, హైదరాబాద్‌లో గ్రాండ్ లైవ్ కన్సర్ట్‌కు సిద్దమవుతున్నారు. “మై టూర్ ఎంఎంకె” పేరుతో మార్చి 22న ఈ సంగీత విందు జరగనుంది. ఇది కీరవాణి గారు గత 20 ఏళ్లలో భాగ్యనగరంలో నిర్వహిస్తున్న మొదటి లైవ్ ఈవెంట్ కావడం విశేషం.
ఈ కన్సర్ట్‌లో “అల్లరి ప్రియుడు,” “అన్నమయ్య,” “బాహుబలి,” “ఆర్ఆర్ఆర్” వంటి ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్‌కి చెందిన పాటలు ప్రత్యక్ష ప్రదర్శనగా సంగీత ప్రియులను మంత్రముగ్ధుల్ని చేయనున్నాయి. టిక్కెట్లు ఇప్పటికే ఆన్‌లైన్‌లో విక్రయానికి వచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లో లైవ్ మ్యూజిక్ కన్సర్ట్‌లు తక్కువగా జరుగుతున్నప్పటికీ, కీరవాణి లాంటి దిగ్గజం మ్యూజిక్ షో నిర్వహించడం అభిమానుల్లో ఉత్సాహం రేకెత్తిస్తోంది.
వందలాది గాయకులు, గాయనులు, ఆర్కెస్ట్రా ఈ వేదికపై ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ ఈవెంట్ విజయవంతమైతే, భవిష్యత్తులో మరిన్ని సంగీత కార్యక్రమాలకు ఇది మార్గం చూపనుంది.