టాలీవుడ్ : మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో జాతీయ అవార్డు గ్రహీత నగేష్ కుకునూర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గుడ్‌లక్ సఖి‘. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ మూవీ టీజర్‌ని ఇవాళ ప్రభాస్ తో విడుదల చేయించింది ఈ చిత్ర యూనిట్. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందబోతుంది. ఈ దర్శకుడు ఇదివరకే ‘ఇక్బాల్’ అనే పేరుతో బాలీవుడ్ లో ఒక స్పోర్ట్స్ డ్రామా తీసాడు. ఆ సినిమా మంచి పేరు సాధించింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ ఒక పల్లెటూరిలో ఉండే చలాకి అమ్మాయి లాగ నటించింది. వూరిలో దురదృష్టవంతురాలు అని ముద్ర పడిన ఒక అమ్మాయి షూటింగ్ లో తన ప్రతిభ నిరూపించుకొని తన పైన పడిన ముద్ర ఎలా పోగొట్టుకుంటుందనేది మూల కథ అని టీజర్ లో అర్ధం అవుతుంది. బాడ్ లక్ సఖి నుండి గుడ్ లుక్ సఖి గా కీర్తి సురేష్ ఎలా మారింది అనే ప్రయాణమే ఈ సినిమా అని తెలుస్తుంది.
కథని అటుంచితే టీజర్ లో చూపించిన కీర్తి సురేష్ చలాకి యాక్టింగ్, వూర్లో ఉండే మూఢ నమ్మకాలు, వదంతులు, ఎమోషన్స్ ఆకట్టుకున్నాయి. ఆది పినిశెట్టి తో ప్రేమ, కోచ్ గ జగపతి బాబు ఇన్స్పిరేషనల్ యాక్టింగ్ ఆకట్టుకున్నాయి. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అంటేనే భావోద్వేగాలతో కూడుకున్న సినిమా అయి ఉంటుంది. టీజర్ వరకు ఈ సినిమా టీం సక్సెస్ అయినట్టే అనిపిస్తుంది. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు, చిరంతాన్ దాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో ఈ సినిమాని ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ ప్రొడక్షన్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర నిర్మిస్తున్నారు.