హైదరాబాద్: కీర్తి సురేష్ 2016 లో నేను శైలజ సినిమా తో తెలుగు లో ప్రయాణం స్టార్ట్ చేసింది. పెద్ద హీరో సినిమాల్లో పెద్దగా నటించకపోయిన కూడా అంత కన్నా ఎక్కువ పేరు, కీర్తి ఒక్క మహానటి తోనే సాధించింది. తన పేరుని, తన పేరుకి కీర్తి తెచ్చిపెట్టి తనని మహానటి అంటేనే గుర్తుపట్టే స్థాయికి తీసుకెళ్లిన సినిమా తర్వాత ఆ పేరుని నిలుపుకోవడానికి కీర్తిసురేష్ చాలానే కష్టాలు పడుతుంది. సినిమా సెలెక్షన్స్ కూడా చాలా జాగ్రత్త గా చేస్తుంది. తన దగ్గరకి వచ్చిన కథల్ని స్టార్స్ ఉన్నారా అన్నట్టు కాకుండా కంటెంట్ ఆధారంగా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది.
ఈరోజే తాను నటించిన కథ ప్రాముఖ్యమైన సినిమా పెంగ్విన్ ఓటీటీ లో రిలీజ్ అయ్యి మిశ్రమ స్పందన వినిపిస్తుంది. పెంగ్విన్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇంస్టాగ్రామ్ లో లైవ్ ప్రమోషన్ లో కీర్తి కొన్ని విషయాలు చెప్పుకొచ్చింది. అందులో భాగంగా తెలుగు లో తన తదుపరి సినిమా మహేష్ బాబు తో ‘సర్కారు వారి పాట’ లో చేస్తున్నట్టు చెప్పింది. ఇప్పటికే ఈ సినిమా లో కియారా అద్వానీ చేస్తున్నట్టు వార్తలు వచ్చిన కీర్తి సురేష్ ప్రకటన తో ఆ వార్తలకి శుభం కార్డు పడినట్లే. ఈ సినిమాతో పాటు కీర్తి సురేష్ తెలుగు లో ‘రంగ్ దే’ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నితిన్ తో మొదటి సారి నటిస్తుంది.