టాలీవుడ్: మహానటి సినిమా ద్వారా నేషనల్ అవార్డు గెలిచి తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండే సినిమాలే ఎంచుకుంటూ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ఎక్కువ చేసుకుంటూ తన కెరీర్ ని ముందుకు తీసుకెళ్తుంది కీర్తి సురేష్. ఆ బాటలోనే పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి సినిమాలు వరుసగా సిద్ధం చేసింది. పెంగ్విన్ ఇదివరకే ప్రైమ్ లో విడుదలయ్యి నెగటివ్ టాక్ తెచ్చుకుంది. గుడ్ లక్ సఖి ఇంకా విడుదల అవ్వాల్సింది. మిస్ ఇండియా సినిమా నిన్ననే ‘నెట్ ఫ్లిక్’ ఓటీటీ ద్వారా విడుదల అయింది. ఈ సినిమా టాక్ ఇపుడు చూద్దాం.
కథ విషయానికి వస్తే ట్రైలర్ చూసిన వారికి కథ పూర్తిగా అర్ధం అయిపోతుంది. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి బిజినెస్ వుమన్ అయ్యి చాలా ఎత్తుకు ఎదగాలి. దాని కోసం ఆమె ఎదుర్కొనే సవాళ్లు అధిగమించే కష్టాలే కథ అనేది తెలుస్తుంది. ఇందులో ట్విస్ట్స్ ఏమీ ఉండవు. కానీ కథనం లోనే దర్శకుడి పనితనం ఏంటనేది తెలుస్తుంది. చాలా సీన్స్ కన్వీన్సింగ్ గా అనిపించవు. సినిమా మొదలైనప్పుడు హీరోయిన్ పాత్ర ఇంటెన్షన్ ఏంటి అనేది క్లియర్ గానే చెప్తాడు కానీ సినిమా ముందుకు వెళ్లే కొద్దీ అది క్లియర్ గా చెప్పే ప్రయత్నం జరగలేదు అనిపిస్తుంది. ఒక చిన్న స్టార్ట్ అప్ వల్ల ఒక రెండు నెలల్లో అమెరికా మొత్తం తన సంస్థలున్న పెద్ద బిజినెస్ మెన్ తన వ్యాపారం మొత్తం కోల్పోయి జీరో లెవెల్ కి చేరుకోవడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఒక స్టార్ట్ అప్ ఫౌండర్ గురించి అమెరికా చానెల్స్ లో అమెరికా ప్రెసిడెంట్ ఎలెక్షన్స్ జరిగినట్టు వార్తలు ఇవ్వడం కొంచెం చూడడానికి ఇబ్బంది గా అనిపిస్తుంది. ఇలాంటి చాలా సీన్స్ వస్తూ పోతూ ఉంటాయి.ఇలాంటి సినిమాల్లో ఉండాల్సిన ఒక ఎమోషన్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకొన్ని ఎమోషనల్ సీన్స్ రాసుకొని వాటి ద్వారా హీరోయిన్ ఇన్స్పిరేషనల్ జర్నీ తీసుకుంటే ఇంకా బాగుండేది అనిపించింది.
టెక్నిషియన్స్ విషయానికి వస్తే కథ ఐడియా మంచిగానే ఉన్నా కూడా దర్శకుడు పూర్తిగా తనకి వచ్చిన అవకాశం ఉపయోగించుకోలేదు అని అర్ధం అవుతుంది. కథనం విషయం లో తడబడ్డాడు అనిపిస్తుంది. కొన్ని అద్భుతమైన సీన్స్ రాసుకొని ముందుకు వెళ్లాల్సిన స్థానం లో హీరోయిన్ తో ఒక పెద్ద కొటేషన్ చెప్పించి ఎలివేట్ చేసి ముందు తీసుకెల్తూ ఉంటాడు. డైలాగ్స్ పరవాలేదు అనిపించాడు. ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన థమన్ పాటలు పరవాలేదు కానీ బాగ్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఒక కమర్షియల్ మాస్ మూవీ కి ఇచ్చినట్టు ఇచ్చాడు. ఎక్కువ శాతం రవితేజ మిరపకాయ్ మ్యూజిక్ షేడ్స్ కనిపిస్తాయి. సినిమాలో చెప్పుకోదగ్గ విషయం సినిమాటోగ్రఫీ. సుజీత్ వాసుదేవ్ విజువల్స్ ఆకట్టుకున్నాయి. నిర్మాణ విలువలకి ఎక్కడా డోకాలేదు.
నటీ నటుల విషయానికి వస్తే కీర్తి సురేష్ తన వరకు బాగానే చేసుకుపోయింది. అసలు ఈ సినిమా జస్ట్ సింగల్ లైన్ విని సినిమా చేయడానికి ఒప్పుకుందా లేక పూర్తిగా విని ఒప్పుకుందా అని డౌట్ రాక మానదు. రాజేంద్ర ప్రసాద్, కమల్ కామరాజ్, నదియా, పూజిత పొన్నాడ, నరేష్, శ్రీ విద్య పాత్రలు ఎదో అలా కథ లాగే వెళ్ళిపోతూ ఉంటాయి. ఎక్కడా ఆకట్టుకొనే పాత్రలు కానీ హావా భావాలు కానీ ఏమీ లేవు. జగపతి బాబు కూడా ఎప్పటి లాగే తన స్పేస్ వరకు మెప్పించాడు. ఈ సినిమాలో మరో పాత్ర ‘నవీన్ చంద్ర’. సినిమా లెంగ్త్ తక్కువ అయ్యి ఒక లవ్ ట్రాక్ లాంటిది పెట్టడం కోసం ఈ పాత్ర పెట్టినట్టు ఉంటుంది తప్ప ఈ పాత్ర ఉపయోగం పెద్దగా ఏమి లేదు.
మొత్తంగా చెప్పాలంటే ఒక ఇన్స్పిరేషనల్ కథని సెమి కమర్షియల్ సినిమాగా ప్రయత్నించారు అని అనిపిస్తుంది.