టాలీవుడ్: మహానటి సినిమా ద్వారా నేషనల్ అవార్డు గెల్చుకున్న నటి కీర్తి సురేష్. ప్రస్తుతం ఈ హీరోయిన్ రెండు మూడు క్రేజీ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తుంది. అందులో ‘మిస్ ఇండియా’ ఒకటి. ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. టైటిల్ ని బట్టి ఇదేదో అందాల పోటీ విన్నర్ లాగా అనిపిస్తుంది. కానీ ఇదొక బ్రాండ్ అని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి తన బిజినెస్ ఎస్టాబ్లిషమెంట్ ఆలోచనని ఆచరణలోకి పెట్టి గెలుపొందడానికి ఎలాంటి కస్టాలు పడింది అనేదే కథ అని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది.
‘నిజానికి చాలా దూరంగా అబద్దానికి చాలా దగ్గరగా బ్రతుకుతున్నావ్.. నువ్వు అన్నయ్య జాబ్ చేస్తే తప్ప మన ఇల్లు సరిగా గడవదు.. అలాంటిది నువ్ బిజినెస్ చేయడం’ అని తల్లి పాత్ర నదియా చెప్పడం.. ‘బిజినెస్ అనేది నీ మాటల్లో నుంచి కాదు.. నీ మనసులో నుంచి కూడా పూర్తిగా తీసేయ్’ అని అన్నయ్య పాత్ర హెచ్చరించడం వంటివి సాధారణ మిడిల్ క్లాస్ కుటుంబంలో ఎదురయ్యే కష్టాలని తెలియజేస్తోంది. దీనిని బట్టి చూస్తుంటే కీర్తి సురేష్ మరొక పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది.
ఏప్రిల్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా చాలా ఆలస్యం అయింది. చివరికి నెట్ ఫ్లిక్స్ లో విడుదల అవబోతుంది. నవంబర్ 4 నుండి ఈ సినిమా నెట్ ఫ్లిక్ లో అందుబాటులో ఉండబోతుంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు ఈ సినిమాని నిర్మించారు. నరేంద్ర నాథ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి థమన్ సంగీతం ఆకర్షణ అవబోతుంది. ఇక ఈ సినిమాలో కీర్తి తో పాటు నవీన్ చంద్ర,జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేష్ ,నదియా , కమల్ కామరాజ్ నటించారు. ప్రస్తుతం ఈ సినిమాని తెలుగు , మలయాళం మరియు తమిళ్ భాషల్లో విడుదల చేస్తున్నారు.