టాలీవుడ్: మహానటి సినిమా ఘన విజయం తర్వాత తన రూట్ మర్చి కథకి ప్రాముఖ్యత ఇచ్చి అలాంటి పాత్రలే ఎంచుకుంటూ చేస్తూ పోతుంది కీర్తి సురేష్. ఈ మధ్య వచ్చిన పెంగ్విన్, మిస్ ఇండియా త్వరలో రాబోతున్న ‘గుడ్ లక్ సఖి’ సినిమాలు ఆ కోవకే చెందుతాయి. వీటితో పాటు కీర్తి సురేష్ ‘సాని కాయిధమ్’ అనే మరో తమిళ్ సినిమాలో కూడా నటిస్తుంది. దీపావళి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇవాళ విడుదల చేసారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ లుక్ చూసి షాక్ కి గురి అవ్వాల్సిందే. ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలో 7 /జి బృందావన్ కాలనీ డైరెక్టర్ సెల్వ రాఘవన్ నటిస్తున్నాడు. కీర్తి, సెల్వ రాఘవన్ ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది ఈ సినిమా టీం.
దండుపాళ్యం లాంటి సినిమాల్లో ఉండే లుక్ తో ఆశ్చర్యపరచింది కీర్తి. ఒక హత్య చేసి దానికి వాడిన ఆయుధాల్ని పట్టుకొని వచ్చి పోలీస్ స్టేషన్ లో సమర్పించి కూర్చున్నట్టు ఉన్న లుక్ విడుదల చేసారు. ఇలాంటి కారెక్టర్ లో కీర్తి లాంటి హీరోయిన్ ని చూడడం ఇదే మొదటిసారి. ఈ సినిమాలో కీర్తి సురేష్ డీ గ్లామర్ పాత్రలో నటిస్తుంది. ఒక వైపు కమర్షియల్ పాత్రలు చేస్తూనే మరోవైపు ఇలాంటి పాత్రలు చేస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తుంది కీర్తి. స్క్రీన్ సీన్ మీడియా ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ ఈ సినిమాని నిర్మిస్తుంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమాని అరుణ్ మాతేశ్వరం దర్శకత్వం వహించారు.