కోలీవుడ్: మహానటి కీర్తిసురేష్ కరోనా వల్ల వచ్చిన ఖాళీ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటుంది. కొత్త కథలు వింటూ కొత్త సినిమాలు బాగానే సైన్ చేస్తుంది. ఇప్పటికే తాను తీసిన పెంగ్విన్ సినిమా ఓటీటీ లో విడుదల అయింది. ‘మిస్ ఇండియా’, ‘గుడ్ లుక్ సఖి’ షూటింగ్స్ ముగింపు దశలో ఉన్నాయి. మహేష్ బాబు తో ‘సర్కారు వారి పాట’ లో కూడా హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించబోతుంది. నితిన్ తో చేస్తున్న ‘రంగ్ దే’ కూడా షూటింగ్ మధ్యలో ఉంది. ఇప్పడు తమిళ్ లో మరొక సినిమా ప్రకటించింది ఈ హీరోయిన్.
‘నేను శైలజ’ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీ కి పరిచయమైన కీర్తి సురేష్ ‘నేను లోకల్’ సినిమాతో రెండు విజయాలు అందుకుంది. ఆ తర్వాత తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోలు స్టార్ దర్శక నిర్మాతలతో వర్క్ చేస్తూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనకు ఆమె ‘జాతీయ ఉత్తమ నటి’ అవార్డును కూడా గెలుచుకుంది. అప్పటినుండి కీర్తి ఇక వెనుదిరిగి చూసిందే లేదు. తాను తియ్యబోయే సినిమాలను ఆచి తూచి ఎంచుకుంటుంది.
ప్రస్తుతం కీర్తి సురేష్ ‘సాని కాయిదం’ అనే తమిళ్ సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాలో మొదటి సారి ప్రముఖ తమిళ దర్శకుడు ‘సెల్వ రాఘవన్’ కూడా నటిస్తున్నాడు. సెల్వ రాఘవన్ ‘7 /G బృందావన్ కాలనీ’ దర్శకుడిగా తెలుగు వాళ్ళకి సుపరిచితం. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. పోస్టర్ చూస్తుంటే కీర్తి మరోసారి ఛాలెంజింగ్ రోల్ కనిపించబోతోందని స్పష్టం అవుతోంది. స్క్రీన్ సీన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు