నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన కీర్తి సురేష్‌కు బాలీవుడ్ ప్రయాణం అంతగా సాఫీగా సాగలేదు. అట్లీ తమిళ బ్లాక్‌బస్టర్ ‘తెరి’ ఆధారంగా వచ్చిన ‘బేబీ జాన్’లో నటించిన ఆమె, డాక్టర్ మీర పాత్రలో కన్పించినా.. సినిమా రూ.160 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి కేవలం రూ.39.28 కోట్లే వసూలు చేయడం షాకింగ్‌గా మారింది. దీంతో ఆమె హిందీ ఎంట్రీ డిజాస్టర్‌గా మిగిలింది.
కీర్తి నటనపై విమర్శలొచ్చినప్పటికీ, ఆమె టాలెంట్ గురించి సౌత్ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం, ఆమెకు మళ్లీ లక్కీ ఛాన్స్ దక్కే అవకాశాలున్నాయి. రణబీర్ కపూర్‌తో కలిసి నటించబోయే లవ్ స్టోరీ ప్రాజెక్ట్‌కి ఆమెను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇది అధికారికంగా ఖరారు కాలేదు, కానీ బాలీవుడ్‌లో ఆమెకు మరో అవకాశం రావడం అంటే కెరీర్ రీబిల్డ్‌కి మంచి అవకాశం. ఈసారి బలమైన పాత్రతో ఉంటే కీర్తి తన స్కిల్స్‌ను బాలీవుడ్‌కి కూడా రుజువు చేసే ఛాన్స్ ఉంది. మల్టీ లేయర్డ్ ఎమోషనల్ స్క్రిప్ట్‌తో వస్తే ఆమెకు మళ్లీ బ్రేక్ కచ్చితంగా వర్కౌట్ కావొచ్చు.
మొత్తానికి ‘బేబీ జాన్’ ఫెయిల్యూర్‌తో ఆశలు ఆవిరయ్యాయని అనుకున్న తరుణంలో, రణబీర్ ప్రాజెక్ట్‌లో కీర్తి చాన్స్ బజ్‌ను మళ్లీ రివైవ్ చేస్తోంది.