తిరువనంతపురం: ఇటీవల యుకె నుండి కేరళకు తిరిగి వచ్చిన ఎనిమిది మందికి, కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తెలింది, మరియు వారి నమూనాలను జన్యు విశ్లేషణ కోసం పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపినట్లు ఆరోగ్య మంత్రి కెకె శైలజా శనివారం తెలిపారు.
ఈ విషయం జరిగిన తరువాత, తిరిగి వచ్చిన వారిని మరిన్ని పరీక్షలకు గురిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేరళ రాష్ట్రంలోని నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలలో నిఘా ఇప్పుడు మరింతగా పెంచారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల తరువాత, కేసులలో భారీగా పెరుగుదల ఉంటుందని అందరూ భయపడ్డారు.
అయితే, ఎన్నికల వల్ల కేసులలో ఎటువంటి పెరుగుదల కనిపించడం జరగలేదు. ఈ విషయంలో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నందున రాష్ట్రంలో మరణాల రేటు కూడా ఎక్కువగా పెరగలేదని ఆమె తెలిపారు.