ఆంధ్రప్రదేశ్: అసెంబ్లీలో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆయన ఈ సందర్భంగా కవి గుర్రం జాషువా రచించిన కవితను ప్రస్తావించి, రైతన్నకు గౌరవం తెలియజేశారు.
‘‘వాని చెమటోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టువానికి భుక్తి లేదు’’ అన్న ఈ కవితను ఉటంకిస్తూ, రైతుల కష్టాలు గుర్తించి వారికి సహాయపడడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం విస్తృత కేటాయింపులు చేయడం గమనార్హం. ముఖ్యంగా పకృతి వ్యవసాయం, సాంకేతిక వ్యవసాయం, భూసార పరీక్షలు, రాయితీ విత్తనాలు, మరియు ఎరువుల సరఫరా వంటి అంశాలపై ప్రాధాన్యం ఇచ్చారు.
పంటల బీమాకు రూ.1,023 కోట్లు, అన్నదాత సుఖీభవ పథకానికి రూ.4,500 కోట్లు కేటాయించారు.
ఇది కాకుండా, డిజిటల్ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రూ.44.77 కోట్లు, వడ్డీ లేని రుణాల కోసం రూ.628 కోట్లు కేటాయించారు.
ఈ కేటాయింపుల ద్వారా రాష్ట్రంలోని రైతులు అధిక పంట దిగుబడులు పొందడంతోపాటు ఆర్థికంగా బలపడతారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ విధంగా వ్యవసాయ రంగం పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన ప్రకటించారు.