fbpx
Sunday, December 22, 2024
HomeTop Movie Newsరికార్డుల మోత మోగిస్తున్న కేజీఎఫ్-2 ట్రైలర్!

రికార్డుల మోత మోగిస్తున్న కేజీఎఫ్-2 ట్రైలర్!

KGF-2-TRAILER-SETS-RECORDS-WITH-109MILLION-VIEWS

మూవీడెస్క్: యశ్‌ హీరోగా వచ్చి ఎంతో సంచలనం రేపిన చిత్రం కేజీఎఫ్. ఈ చిత్రానికి సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభిమానులు ఈ సీక్వెల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాగా యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కెజిఎఫ్‌-2. హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఏప్రిల్‌14వ తేదీన విడుదల చేయనుంది చిత్ర బృందం.

ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఈ ఆదివారం సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ రిలీజైన ఒక్కరోజులోనే అన్ని భాషల్లోనూ రికార్డుల మోత మోగిస్తోంది. ఈ ట్రైలర్ కేవలం 24గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 109 మిలియన్‌ వ్యూస్‌ను సాధించింది.

ఈ చిత్ర ట్రైలర్‌కి కన్నడ భాషలో 18మిలియన్‌ వ్యూస్‌ రాగా, తెలుగులో 20 మిలయన్,హిందీలో 51 మిలియన్, తమిళంలో 12 మిలియన్, మలయాళంలో 8మిలియన్‌ వ్యూస్‌ రావడం విశేషం. దీన్ని బట్టి యావత్ దేశం ఈ చిత్రం కోసం ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తోందో అర్థం అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular