మూవీడెస్క్: నేచురల్ స్టార్ నాని తన విజయవంతమైన కెరీర్‌లో కొత్త కంటెంట్‌తో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
‘దసరా’, ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ వంటి వరుస హిట్స్ తో నాని నిర్మాతల ఫేవరెట్ హీరోగా మారిపోయాడు.
ఇప్పుడు నాని ‘హిట్ 3’ లో నటిస్తుండడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో ఇప్పటికే ‘హిట్’ సిరీస్ రెండు విజయాలను అందుకుంది.
ఇక ఈ సినిమాకు నాని నిర్మాతగా కూడా వ్యవహరించడం వల్ల, కంటెంట్ పరంగా ఎలాంటి రాజీపడకపోవడం ఖాయం.
ఇక నాని సరసన హీరోయిన్‌గా ‘KGF’ ఫేమ్ శ్రీనిధి శెట్టి నటించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. కేజీఎఫ్‌తో భారీ పాపులారిటీ తెచ్చుకున్న శ్రీనిధికి ఆ తరువాత సరైన విజయాలు దక్కలేదు.
ఇక ఇప్పుడు ఆమె, నాని సరసన నటించడం మరింత క్రేజ్ తెచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ వార్తపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, నాని-శ్రీనిధి కాంబినేషన్ పై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.
ఇక ‘హిట్ 3’ లో నాని తన నటనతో మరోసారి ప్రేక్షకులను మెప్పించేలా కనిపించనున్నట్లు తెలుస్తోంది.