శాండల్ వుడ్: 2018 డిసెంబర్ లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా కేజీఎఫ్. ఈ సినిమా ద్వారా అందరి కళ్ళు కన్నడ ఇండస్ట్రీ వైపు చూసేలా చేసాయి. బాహుబలి తర్వాత అంత గుర్తింపు తెచ్చుకున్న సౌత్ సినిమాగా కేజీఎఫ్ పేరు సంపాదించింది. ఈ సినిమాకి కొనసాగింపుగా కేజీఎఫ్ చాప్టర్ 2 తీస్తున్న విషయం తెల్సిందే. షూటింగ్ పార్ట్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైన సినిమా టీం హీరో యష్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 8 న ఈ సినిమాకి సంబందించిన టీజర్ ని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు, కానీ అనుకోకుండా టీజర్ విడుదలకి ముందే లీక్ లు రావడంతో సడన్ గా ఈరోజే విడుదల చేసారు.
టీజర్ ఆద్యంతం ఎలేవేషన్స్ తో యాక్షన్ సీన్స్ తో ఆకట్టుకుంది. టీజర్ లో ‘గొప్ప వాళ్ళు గొప్ప ప్లేసెస్ నుండి వస్తారు కానీ అది అబద్దం.. గొప్పవాళ్లు కొన్ని ప్లేసెస్ ని ఇంకా గొప్పగా చేస్తారు’ అనే డైలాగ్ తో ప్రారంభించి సినిమాలోని ముఖ్యమైన కారెక్టర్లన్నీ అలా ఒక్కో ఫ్రేమ్ లో చూపిస్తుంటారు. చివరగా యష్ ఒక గన్ తో వరుసగా ఉన్న వాహనాల సమూహాన్ని కాల్చే సీన్ చూపించి అయిపోయాక హీట్ ఎక్కిన గన్ రిలీజ్ పాయింట్ వద్ద సిగరెట్ అంటించి హీరోయిజం ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లి టీజర్ ని ముగించారు. మొదటి పార్ట్ లో లాగానే ఇందులో కూడా తల్లి సెంటిమెంట్ ఉండనున్నట్టు కూడా చూపించారు.
టీజర్ లో ప్రతి ఫ్రేమ్ విజువల్ వండర్ లా తీర్చిదిద్దారు. మొదటి పార్ట్ లిమిటెడ్ బడ్జెట్ లో తీసినా కూడా అద్భుతంగా కనిపిస్తుంది. మొదటి పార్ట్ సూపర్ సక్సెస్ అవడం తో రెండవ పార్ట్ కి బడ్జెట్ ఎక్కువగా కేటాయించారు. అది ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. మొదటి పార్ట్ లో ఉన్న యాక్షన్ సీన్స్ కన్నా ఇందులో రెట్టింపు యాక్షన్ సీన్స్ ఉన్నట్టు తెలిసిపోతుంది. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, రావు రమేష్, సంజయ్ దత్, రవీనా టాండన్ , ఈశ్వరి రావు తదితరులు నటించారు. విడుదల తేదీ ఇంకా ప్రకటించని ఈ సినిమా సమ్మర్ లో విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.