శాండల్ వుడ్: 2018 లో అసలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై, విడుదలైన అన్ని భాషల్లో అద్భుతమైన విజయం, కలెక్షన్స్ సాధించి పాన్ ఇండియా సినిమాగా రూపాంతరం చెందిన సినిమా ‘కేజిఎఫ్ చాప్టర్ 1’. ఈ సినిమాకి కొనసాగింపుగా ‘కేజిఎఫ్ చాప్టర్ 2 ‘ దాదాపు సగం షూటింగ్ అయిపోయింది. కరోనా కారణంగా గత 5 నెలలుగా షూటింగ్స్ అన్నీ ఆగిపోవడం తో ఈ సినిమా కూడా షూటింగ్ పెండింగ్ లో పడింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం షూటింగ్స్ చేసుకోవచ్చని పెర్మిషన్ ఇచ్చి కోవిద్ నిబంధనలు పాటిస్తూ షూటింగ్ జరుపుకోవచ్చని ఆర్డర్ ఇష్యూ చేసింది.దీన్ని ఫాలో అవుతూ ప్రస్తుతం కేజిఎఫ్ టీం షూటింగ్ మొదలు పెట్టారు.
ఈ సినిమా షూటింగ్ లో ప్రకాష్ రాజ్ పాల్గొన్న సీన్స్ తో షూటింగ్ ప్రారంభించారని ట్విట్టర్ ద్వారా తెలియచేసారు ఈ సినిమా టీం. కరోనాలో డేర్ చేసిన మొట్టమొదటి ప్యాన్ ఇండియన్ చిత్రంగా కేజీయఫ్ రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ విల్లన్ గా నటిస్తున్నాడు. అయితే ప్రస్తుతం షూటింగ్ లో హీరో యాష్, ప్రకాష్ రాజ్ లాంటి లీడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. మిగతా హీరోలు , డైరెక్టర్ లు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా షూటింగ్ ప్రారంభించడానికి వెనకడుగు వేశారు. కానీ కేజిఎఫ్ దైర్యంగా ముందడుగు వేసి షూటింగ్ ప్రారంభించారు. చూడాలి వీళ్ళని చూసి ఎంత మంది మల్ల తమ సినిమాల షూటింగ్స్ మొదలు పెడతారో.