fbpx
Saturday, January 18, 2025
HomeMovie News'మహాసముద్రం' లో కేజీఎఫ్ విలన్

‘మహాసముద్రం’ లో కేజీఎఫ్ విలన్

KGFVillain In MahaSamudramMovie

టాలీవుడ్: RX100 సినిమాతో తొలి సినిమాకే సూపర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి. ఒక బోల్డ్ అటెంప్ట్ ని తెరకెక్కించి మంచి విజయం సాధించాడు ఈ యువ డైరెక్టర్. తర్వాత చాలా గాప్ తీసుకుని మహా సముద్రం అనే సినిమాని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాని మల్టీ స్టారర్ గా రూపొందిస్తున్నాడు. ఈ సినిమాని ఒక ఇంటెన్స్ యాక్షన్ మరియు లవ్ స్టోరీ గా రూపొందిస్తున్నట్టు హింట్స్ ఇచ్చారు. ఈ సినిమాలో బొమ్మరిల్లు సిద్దార్థ్ మరియు శర్వానంద్ నటిస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత సిద్దార్థ్ ఈ సినిమాతో డైరెక్ట్ తెలుగు మూవీ చేస్తున్నాడు.

ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రని ఇవాళ రివీల్ చేసారు. ‘కేజీఎఫ్’ సినిమాలో గరుడ అనే విలన్ పాత్రలో నటించి మెప్పించిన నటుడు గరుడ రామ్. ‘కేజీఎఫ్’ సినిమా తర్వాత వేరే బాషా అవకాశాలు కూడా ఎక్కువగానే పొందుతున్నాడు ఈ నటుడు. ఈ నటుడు ఈ మధ్య తమిళ్ లో విడుదలైన ‘సుల్తాన్’ సినిమాలో కూడా నటించాడు. ప్రస్తుతం ‘మహా సముద్రం’ సినిమాలో కూడా ధనుంజయ్ అనే పాత్రలో కనిపించనున్నాడు. మరో ముఖ్య పాత్రలో జగపతి బాబు కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. వీళ్ళిద్దరితో విలనిజం ని మరో రేంజ్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు డైరెక్టర్ అజయ్ భూపతి.

AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ బ్రహ్మం సుంకర నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో సిద్దార్థ్, శర్వా కి జోడి గా అదితి రావు హైదరి, అను ఇమ్మానుయేల్ నటిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ సంగీతంలో ఈ సినిమా రూపొందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular