కోలీవుడ్: ఇంటర్నేషనల్ ఇండియన్ టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ లో జెర్సీ సినిమాతో పాటు అదే సంవత్సరం లో విడుదలై అద్భుతమైన విజయం సాధించిన ‘ఖైదీ’ సినిమా కూడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శనకి ఎంపికైంది. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా సూపర్ హిట్ గా నిలిచింది. కార్తీ కెరీర్ లో మరో మైలు రాయి గా నిలిచింది. ఒక జైలు నుండి విడుదలైన ఖైదీ తన కూతురిని చూడడానికి వెళ్లే క్రమం లో తనకి ఎదురైన అనివార్య కారణాల మధ్య పోలీసులకి చేసిన సహాయం అన్ని కలిసి ఒక ఎమోషనల్, యాక్షన్ ఎంటర్టైనర్ గా దాదాపు 100 కోట్ల కలెక్షన్స్ సాధించింది.
ఈ సినిమా డైరెక్టర్ ‘లోకేష్ కనకరాజ్’ ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించ బోతుందని ట్వీట్ చేసారు. ప్రస్తుతం ‘లోకేష్ కనకరాజ్‘ , ఇళయ దళపతి విజయ్ తో తీసిన ‘మాస్టర్’ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. కరోనా కారణంగా ఆగిపోయింది. ఇదిలా ఉండగా కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా ఎవడూ ఆపలేడు అని నాని ‘జెర్సీ’, కార్తీ ‘ఖైదీ’ సినిమాలు మరోసారి నిరూపించాయి. రెగ్యులర్ గా కాకపోయినా అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు వచ్చి సినిమా అభిమానుల దాహాన్ని తీరుస్తున్నాయి కాబట్టే ఇప్పటికీ సినిమాలు అంటే ఒక రకమైన ఆదరణ ఉంది.