fbpx
Sunday, January 19, 2025
HomeMovie Newsక్రేజీ డైరెక్టర్ తో కమల్ మూవీ

క్రేజీ డైరెక్టర్ తో కమల్ మూవీ

KhaithiDirector LokeshKanagaraj MovieWithKamalHasan

చెన్నై: 2019 లో విడుదలైన కార్తీ నటించిన ‘ఖైదీ’ సినిమాతో అందరి చూపును తన వైపు తిప్పుకున్న దర్శకుడు ‘లోకేష్ కనగరాజ్‘. ఆ వెంటనే తమిళ్ స్టార్ హీరో ఇళయ తలపతి విజయ్ ‘మాస్టర్’ అవకాశం ఇచ్చాడు. కరోనా వల్ల విడుదల ఆగిపోయింది లేకపోతే ఈపాటికి ఆ సినిమా విడుదల అయ్యి ఉండేది. ఇపుడు మరో సినిమా లైన్ లో పెట్టాడు ఈ క్రేజీ దర్శకుడు. మొన్నటి వారికి కమల్, రజిని కాంబినేషన్ లో లోకేష్ కనగరాజ్ మూవీ అని రూమర్స్ వినిపించాయి, ఈ ప్రకటన తో అందులో కొంతవరకు నిజం అని స్పష్టం అయింది.

రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందించబడుతుంది. కమల్ హాసన్ 232 వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ‘వన్స్ అపాన్ ఆ టైం డేర్ లివ్డ్ ఎ ఘోస్ట్’ – ‘చాల కాలం క్రితం ఒక రాక్షసుడు ఉండేవాడు’ అంటూ మొత్తం గన్ లతో కమల్ ఆకారం వచ్చేలా ఒక పోస్టర్ రూపొందించి అఫిషియల్ గా ఈ సినిమా ప్రకటన చేసాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఈ చిత్రాన్ని 2021 వేసవి లో విడుదల చేస్తాం అంటూ ముందే ప్రకటించాడు. అప్పటిలోగా ఈ సినిమా పూర్తి చేసి ఎలక్షన్స్ లో బిజీ అవుదామని కమల్ చూస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular