బాలీవుడ్ టాప్ హీరోయిన్ కియరా అద్వాణీ మరో క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రెగ్నెన్సీ వార్తలను అధికారికంగా ప్రకటించిన కియరా, తన ప్రస్తుత కమిట్‌మెంట్‌లను పూర్తిచేయడంపైనే దృష్టి పెట్టింది. అందుకే, ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రూపొందుతున్న డాన్ 3 సినిమాను వదులుకున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటిస్తుండగా, కియరా ఫీమేల్ లీడ్ రోల్ కోసం ఎంపికైంది. కానీ, ప్రెగ్నెన్సీ కారణంగా చిత్రబృందానికి నో చెప్పిందట. దీంతో మేకర్స్ కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నారని సమాచారం. అయితే, కియరా ఇప్పటికే వార్ 2, టాక్సిక్ షూటింగ్ పూర్తిచేయడానికి ప్రణాళికలు వేసుకుంటోంది.
కియరా ఫ్యాన్స్ ఆమె వ్యక్తిగత జీవితాన్ని సెలబ్రేట్ చేస్తూనే, డాన్ 3 నుంచి తప్పుకోవడం పట్ల మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌లో ఈ ప్రాజెక్ట్‌కు గల క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుంటే, కియరా ఇది మిస్ చేసుకోవడం కోలుకోలేని లోటేనని అంటున్నారు.
సిద్ధార్థ్ మల్హోత్రాతో పెళ్లి తర్వాత కూడా కెరీర్‌లో ఫుల్ బిజీగా ఉన్న కియరా, తల్లి అయ్యాక మళ్లీ ఫుల్ ఫామ్‌లో సినిమాలు చేస్తుందా? లేదా బ్రేక్ తీసుకుంటుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఆమె ధూమ్ 4, శక్తి షాలిని లాంటి ప్రాజెక్ట్‌లను స్వీకరించబోతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి.