టాలీవుడ్: జెంటిల్ మాన్ సినిమా నుండి రోబో 2 సినిమా వరకు వరుసగా సక్సెసఫుల్ సినిమాలు తీస్తున్న దర్శకుడు శంకర్. ఇరవై సంవత్సరాల క్రితం నుండి పాన్ ఇండియా మూవీ లు తీయగల కెపాసిటీ ఉన్న దర్శకుడు శంకర్. రాజమౌళి కన్నా ముందు నేషనల్ లెవెల్ లో గుర్తింపు ఉన్న సౌత్ దర్శకుడు ఎవరు అంటే ముందుగా వినిపించే పేరు శంకర్. శంకర్ మొదటి సారి ఒక తెలుగు హీరో తో సినిమా చేస్తున్నాడు. శంకర్ , రామ్ చరణ్ కాంబినేషన్ లో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమా పైన ఇప్పటికే అంచనాలు పెరిగాయి. ఈ రోజు ఈ సినిమాలో నటించే హీరోయిన్ ని ప్రకటించారు సినిమా టీం.
రామ్ చరణ్ తో ఇదివరకు ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించిన కియారా అద్వాని ఈ సినిమాతో మరో సారి రామ్ చరణ్ తో జత కట్టనుంది. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ 15 వ సినిమాగా ఈ సినిమా రూపొందుతుంది. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై 50 వ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాని దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. శంకర్- కమల్ హాసన్ తో రూపొందిస్తున్న ‘ఇండియన్ -2 ‘ సినిమా మధ్యలోనే ఆగిపోవడం తో శంకర్ ఈ సినిమా పై దృష్టి సారించాడు. ఈ సినిమా తర్వాత రణవీర్ సింగ్ తో హిందీ లో ‘అపరిచితుడు’ సినిమాని రీమేక్ చేయనున్నాడు.