తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం కిలారి రాజేష్ పేరు గట్టిగా వినిపిస్తోంది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ పేరు చర్చల్లో ఉండగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరింత ప్రముఖంగా మారింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ల తర్వాత కిలారి రాజేష్ పేరు పవర్ సెంటర్‌గా తెరపైకి రావడం విశేషం.
పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు తమ సమస్యలు, పనులు కిలారి రాజేష్ ద్వారా పరిష్కరించుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
లోకేష్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన రాజేష్, పలు కీలక డీలింగ్స్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆయన తన కార్యాలయం నుంచి పలు విషయాలను చక్కదిద్దుతున్నారని సమాచారం.
గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో కిలారి రాజేష్ స్కిల్ కేసు వివాదంలో చిక్కుకున్నప్పటికీ, హైకోర్టు ద్వారా రక్షణ పొందారు.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజేష్ మరింత శక్తివంతుడిగా మారారని, లోకేష్ కూడా ఆయనపై పలు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారని సమాచారం.