మూవీడెస్క్: తమిళ చిత్రసీమలో సంగీత దర్శకుడిగా వెలుగొందిన జివి ప్రకాష్, హీరోగా కూడా తనదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న కింగ్‌స్టన్ ఫస్ట్ లుక్ విడుదలైంది.
ఈ పోస్టర్‌లో సముద్రం మధ్య ఓ బోట్‌పై దీపం పట్టుకుని నిలబడి ఉన్న జివి ప్రకాశ్ కనిపించడం సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది.
ఈ చిత్రాన్ని శివకార్తికేయన్ చేతుల మీదుగా లాంచ్ చేయడం విశేషం. కింగ్‌స్టన్ హారర్ అడ్వెంచర్ నేపథ్యంలో సాగుతుంది.
కమల్ ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జివి ప్రకాష్ సరసన దివ్య భారతీ కథానాయికగా నటిస్తున్నారు.
ఇతర కీలక పాత్రల్లో ఆంటోని, చేతన్, కుమారవెల్ తదితరులు కనిపించనున్నారు.
విశేషంగా, చిత్రానికి జివి ప్రకాష్ స్వయంగా సంగీతం అందిస్తున్నారు.
సముద్రంలోని రహస్యాలపై బేస్‌గా సాగే ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది.
జనవరి 9న టీజర్ విడుదల కానుండగా, ఫ్యాన్స్ ఈ సినిమా మరో విజువల్ ఫీస్ట్ అవుతుందని అనుకుంటున్నారు.
సముద్రపు పథంలో కొత్త అనుభూతి ఇవ్వనున్న ఈ సినిమా ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతోంది.