కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, హీరోగా బాగా పేరున్న జీవీ ప్రకాశ్ కుమార్ తన తాజా సినిమా కింగ్‌స్టన్తో మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈ ఫాంటసీ హారర్ డ్రామాను ఆయన నటించడమే కాకుండా, స్వయంగా నిర్మించారు. కమల్ ప్రకాశ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మార్చి 7న థియేటర్లలో విడుదలైంది.
20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, థియేటర్లలో కేవలం రూ.5.35 కోట్లు మాత్రమే వసూలు చేయడంతో భారీ నష్టాన్ని మిగిల్చింది. అయినా ఓటీటీలో అవకాశాన్ని మిస్సవ్వకూడదనుకుంటున్న టీం, ఇప్పుడు ప్లాన్ మార్చింది.
తాజా సమాచారం ప్రకారం, ఈ మూవీ ఏప్రిల్ 4 నుంచి ZEE5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
జీవీ ప్రకాశ్ (31వ సినిమా) సరసన దివ్యభారతి (5వ సినిమా), నితిన్ సత్య, అళగమ్ పెరుమాళ్, చేతన్ కీలక పాత్రల్లో నటించారు. ఫిషింగ్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఆత్మ, మిస్టరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కలిపిన కథ నడుస్తుంది.
స్క్రీన్‌ప్లే మిడిల్ పాయింట్ దాకా ఇన్సిపిరింగ్‌గా కనిపించినా, క్లైమాక్స్ లోపించి ఫీల్ తగ్గించిందన్నది విమర్శ. కానీ ఓటీటీలో విజువల్స్, సౌండ్ డిజైన్ బాగా కుదిరితే రెండవ జీవితం దక్కవచ్చని భావిస్తున్నారు. ఇప్పటివరకు థియేటర్లో మాయ చేయని కింగ్‌స్టన్… ఓటీటీలో మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి.