టాలీవుడ్: మెగా కుటుంబం నుండి వచ్చిన మరో హీరో ‘కళ్యాణ్ దేవ్’. చిరంజీవి అల్లుడిగా ఇండస్ట్రీ లో అడుగు పెట్టాడు కళ్యాణ్ దేవ్. ‘విజేత‘ అనే సినిమాతో హీరో గా జర్నీ ప్రారంభించాడు. రెండవ సినిమాగా ‘సూపర్ మచ్చి’ అనే సినిమా విడుదలకి సిద్ధం గా ఉంది. ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ ‘కిన్నెరసాని’ అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ క్రమంలో కళ్యాణ్ దేవ్ నటిస్తున్న మూడవ సినిమాకి సంబందించిన టీజర్ ఈ రోజు విడుదలైంది. ఈ టీజర్ ద్వారా కళ్యాణ్ దేవ్ ఒక రకంగా సర్ప్రైజ్ చేసాడు అని చెప్పవచ్చు.
‘మీ పాప ఓ అద్భుతం.. కానీ అద్భుతం దగ్గరే ఆపద ఉంటుంది’ అనే డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. టీజర్ మొత్తం లో రెండు టైమ్స్ చూపిస్తుంటారు. ప్రెసెంట్ టైం లో కళ్యాణ్ దేవ్ కనిపిస్తుండగా ఒక పీరియాడిక్ కథ ని పారలల్ గా చూపిస్తుంటారు. కళ్యాణ్ దేవ్ రెండు లుక్స్ లో కనిపిస్తుంటాడు. బీచ్ లో ఒక జంట, వర్షం లో కారు, ఒక వూర్లో కాగడాలు పట్టుకుని జనమంతా కదిలి రావడం లాంటి షాట్స్ తో ఒక థ్రిల్లర్ ఫీల్ కలిగించాడు డైరెక్టర్. మరి ఈ రెండు కథలకి సంబంధం ఏంటి లాంటి ఎలిమెంట్స్ తో టీజర్ ద్వారా సినిమా పైన ఆసక్తి కలిగేలా చేయడం లో విజయవంతం అయ్యారు మేకర్స్.
‘అశ్వద్ధామ’ సినిమాని డైరెక్ట్ చేసిన రమణ తేజ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ టీజర్ లో మహతి స్వర సాగర్ అందించిన బాగ్ గ్రౌండ్ మ్యూజిక్ ఎక్స్ట్రా ఆర్డినరీ అని చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రాఫర్ దినేష్ బాబు పని తనం టీజర్ లోని ప్రతి ఫ్రేమ్ లో కన్పిస్తుంది. SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో కళ్యాణ్ దేవ్ కెరీర్ పరంగా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉన్నాడు.