కిరణ్ అబ్బవరం హీరోగా పీరియాడికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘క’. ఈ చిత్రంతో సుజిత్, సందీప్ దర్శకత్వంలో పరిచయం అవుతున్నారు. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
గ్రామీణ నేపథ్యంతో రూపొందిన ఈ కథలో కిరణ్ అబ్బవరం కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. ఇప్పటికే ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ పూర్తి కాగా, మలయాళంలో దుల్కర్ సల్మాన్ తన సొంత బ్యానర్ పై రిలీజ్ చేయనున్నాడు.
రీసెంట్ గా విడుదలైన జాతర వీడియో సాంగ్ మంచి స్పందన తెచ్చుకుంది. సామ్ సి.ఎస్ సంగీతం సినిమాకు అదనపు బలం కానుంది. ఇది అక్టోబర్ రెండో వారంలో విడుదల కావాలని భావించినప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో దీపావళికి వాయిదా వేసినట్టు టాక్.
దీపావళి సందర్భంగా విడుదలకాబోతున్న శివకార్తికేయన్ అమరన్, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ చిత్రాలతో ఈ సినిమా పోటీ పడనుంది. కిరణ్ అబ్బవరం ‘క’ సినిమాపై చాలా నమ్మకం పెట్టుకున్నాడు. ఈ చిత్రం తనకు బ్రేక్ ఇవ్వబోతుందనే ఆశతో ఉన్నాడు.