fbpx
Friday, December 20, 2024
HomeAndhra Pradeshకిరణ్‌కుమార్ రెడ్డి - చంద్రబాబు భేటీ: కీలక ప‌దవిపై చర్చ

కిరణ్‌కుమార్ రెడ్డి – చంద్రబాబు భేటీ: కీలక ప‌దవిపై చర్చ

మాజీ సీఎం, బీజేపీ నాయకుడు నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి ఆదివారం సీఎం చంద్రబాబుతో హైద‌రాబాద్‌లో భేటీ అయ్యారు. సుమారు గంట పాటు జరిగిన ఈ సమావేశంలో కీలకంగా రెండు అంశాలు చర్చకు వచ్చాయి.

1) కిరణ్‌కుమార్ టీడీపీలో చేరడం, 2) టీటీడీ బోర్డు చైర్మన్ ప‌దవి. ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

2023లో కిరణ్‌కుమార్ రెడ్డి బీజేపీ తరపున రాజంపేట నుంచి పోటీ చేసినప్పటికీ, వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చేతిలో ఓడిపోవడం గమనార్హం. తర్వాత బీజేపీతో దూరంగా ఉంటూ, చంద్రబాబు పాలనను ప్రశంసిస్తూ, టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ఈ పరిణామాలు, కిరణ్ టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు, కిరణ్ టీటీడీ చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. రాజకీయ వర్గాల్లో కిరణ్, చంద్రబాబుతో ఈ పదవి గురించే చర్చించారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే కిరణ్ సోదరుడు కిశోర్‌కుమార్‌ రెడ్డి టీడీపీలో ఉన్నారు, కాబట్టి కిరణ్ చేరితే ఆశ్చర్యం లేదని భావిస్తున్నారు.

Most Popular