జైపూర్: కరోనా పాజిటివ్ వచ్చిన రాజస్థాన్ లోని రాజ్సమండ్ బిజెపి నాయకురాలు ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి గుర్గావ్ లోని ఆసుపత్రిలో మరణించారు. ఆమె వయసు 59. రాజ్‌సమండ్‌కు చెందిన మూడుసార్లు ఎమ్మెల్యే అయిన కిరణ్ మహేశ్వరి గత కొద్ది రోజులుగా మెదంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆదివారం అర్థరాత్రి కన్నుమూశారు.
ఆమె మరణానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, అసెంబ్లీ స్పీకర్ సిపి జోషి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పూనియా, ఇతర నాయకులు సంతాపం తెలిపారు. “బిజెపి నాయకురాలు & రాజ్సమండ్ ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి జి యొక్క అకాల మరణం గురించి తెలుసుకోవడం చాలా బాధగా ఉంది. ఈ కష్ట సమయంలో ఆమె కుటుంబ సభ్యులు మరియు మద్దతుదారులకు నా హృదయపూర్వక సంతాపం” అని గెహ్లాట్ ట్వీట్ చేశారు.
ఎమ్మెల్యే మరణం పట్ల దు:ఖాన్ని వ్యక్తం చేస్తూ సిపి జోషి ఒక ట్వీట్‌లో, “రాజ్‌సమండ్ ఎమ్మెల్యే, కిరణ్ మహేశ్వరి జి యొక్క అకాల మరణం గురించి విన్నప్పుడు షాక్ అయ్యాను. ఈ నష్టాన్ని భరించడానికి శక్తినివ్వమని మొత్తం కుటుంబానికి నా ప్రగాడ సంతాపం మరియు దేవునికి ప్రార్థనలు”, అని ట్వీట్ చేసారు.