టాలీవుడ్: ‘రాజా వారు రాణి గారు’ అనే సినిమా ద్వారా హీరో గా పరిచయం అయ్యాడు కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం ‘SR కల్యాణమండపం‘ అనే సినిమా ద్వారా ఆగష్టు లో మరో సినిమా రిలీజ్ చేయనున్నాడు. వీటితో పాటు రెండో సినిమా పూర్తి కాకుండానే ప్రస్తుతం మూడు సినిమాలు లైన్ లో పెట్టి వరుస సినిమాలకి కమిట్ అవుతున్నాడు. సెబాస్టియన్ అనే సినిమాలో ఒక పోలీస్ రోల్ లో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఒక పీరియాడిక్ కథగా రూపొందుతుంది. దీంతో పాటు కోడి రామకృష్ణ కూతురు నిర్మాణంలో మరో సినిమా ఈరోజు ప్రకటించాడు. పల్లెటూరి నేపధ్యం లో ‘సమ్మతమే’ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. కిరణ్ అబ్బవరం పుట్టిన రోజు సందర్భంగా ‘సమ్మతమే’ సినిమా కి సంబందించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు.
ఈ సినిమాలో కిరణ్ కి జోడీ గా తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి నటిస్తుంది. ఫస్ట్ లుక్ లో ఒక కుర్చీ లో కూర్చుని ఉన్న కిరణ్ ని చూపిస్తూ వెనక నుండి సిగ్గు పడుతూ చూస్తున్న చాందిని చౌదరి కనిపించారు. లవ్ ఈజ్ అన్ కండీషనల్ అనే టాగ్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. పల్లెటూరి నేపధ్యం లో ఉండే ప్రేమకథ అని అర్ధం అవుతుంది. గోపినాథ్ రెడ్డి అనే నూతన దర్శకుడు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. యూజి క్రియేషన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా అప్ డేట్స్ రిలీజ్ చేయనున్నారు.