హైదరాబాద్: ‘రాజావారు రాణిగారు’ సినిమాతో పరిచయమై మెప్పించిన కొత్త నటుడు కిరణ్ అబ్బవరం. ఈ హీరో ప్రస్తుతం 2 సినిమాలు చేస్తున్నాడు. ‘S R కళ్యాణ మండపం EST 1975’ అనే కొత్త టైటిల్ తో ఈ చిత్రం అందరిని ఆకర్షిస్తుంది. మొదటి సినిమా ‘రాజావారు రాణిగారు’ లో ఒక క్యూట్ లవ్ స్టోరీ లో నటించిన ఈ హీరో ప్రస్తుతం రూట్ మర్చి మాస్ టచ్ ఇచ్చాడు. ఈరోజు ఈ హీరో బర్త్ డే సందర్భంగా ఈ చిత్ర బృందం ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసింది. దర్శకుడు పూరి జగన్నాధ్ సోషల్ మీడియా ద్వారా ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసాడు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన టాక్సీవాలా ఫేమ్ ‘ప్రియాంక జవల్కర్’ నటిస్తుంది. ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లొక్డౌన్ వాళ్ళ షూటింగ్ నిలిచిపోయింది.
ఈ సినిమాతో పాటు మరొక సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసాడు ఈ హీరో. ఈ సినిమా పోస్టర్ కొంచెం కొత్తగా, ప్రెసెంట్ చేసిన టాగ్ లైన్స్ కూడా హ్యూమరస్ గా ఉన్నాయి. ‘సెబాస్టియన్ P C 24 ‘ అనే టైటిల్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు ఈ సినిమా టీం. రిపోర్టింగ్ ఫ్రం మదనపల్లి పోలీస్ స్టేషన్ అని టాగ్ లైన్ తగిలించారు. అలాగే ఈ సినిమాలో హీరో కి రేచీకటి ఉందని ఇది సీక్రెట్ అని ఎవ్వరికీ చెప్పొద్దని పోస్టర్ లో తెలిపారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఈ సినిమా హ్యూమరస్ కామెడీ జోనర్ ని చెప్పకనే చెప్పారు మేకర్స్. ఈ సినిమాని బాలాజీ సయ్యపురెడ్డి అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. మొత్తానికి చిన్న సినిమాతో ప్రయాణం ప్రారంభించిన ఈ హీరో రెండు సినిమాలని లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం ఇవి షూటింగ్ దశలో ఉన్నాయి. కరోనా సంక్షోభం ముగిసిపోతే తొందరగా షూట్ ఫినిష్ చేసి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.